పచ్చోడు ఏం చేసినా సంసారం పక్కోడు ఏం చేసినా అదేదో అనే చందాన ఉంటుంది ఎల్లో మీడియా తీరు. అభూత కల్పనలు వండి వార్చడంలో, అసత్య ప్రచారాలు చేయడంలో, బట్ట కాల్చి నెత్తిన వేయడంలో ఎల్లో మీడియా ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటుంది. ఎల్లో మీడియా చెప్పే నీతులకు చేసే పనులకు ఎక్కడా పొంతన ఉండదు. చంద్రబాబు ఏం చేసినా సమంజసమే.. అదే పని ఇంకెవరు చేసినా సన్నాసి తనమే అనే నీచమైన ఆలోచన విధానంలో బ్రతుకుతూ ఉంటుంది.
ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్లో ఫొటో షూట్లు ఎక్కడైనా జరుగుతాయా? ఇలా ఫోటోలు తీసింది సానుభూతి పొందడానికి కాదా? అసలు ఆపరేషన్ థియేటర్లో ఫొటోగ్రాఫర్లను అనుమతించకూడదు. అయినా ఫొటోషూట్లు చేశారంటే దాని అర్థమేంటి? ఏ యాంగిల్ లో కెమెరా ఎక్కడ పెట్టాలి, ఎలా తీయాలని నిర్ణయించుకుని మరీ ఫొటోలు తీసి ప్రచురించారు. దీన్ని మీ డ్రామాలో క్లైమాక్స్ సీన్ అని మేము అనుకోవాలా? అంటూ తనదైన శైలిలో సీఎం జగన్ గారి ప్రమాద ఘటన పై బురద జల్లుతూ ఒక అసత్య కథనాన్ని వండి వార్చింది.
నిజానికి గతంలో చంద్రబాబు స్కిల్ కుంభకోణంలో అరెస్టయి జైల్లో ఉండగా కోసం బాబుకు లేని రోగమంటూ లేదు అంటూ అఫిడవిట్ల మీద అఫిడవిట్ల కోర్టులకి సమర్పించి, కంటి ఆపరేషన్ చేయించాలి అనేటువంటి ఒక కారణంతో బెయిల్ మీద బయటకు వచ్చాడు. వచ్చిన అనంతరం కంటే ఆపరేషన్ అయిన తర్వాత తనకు ఆపరేషన్ చేసిన డాక్టర్లు సహకరించిన నర్సులు ఇతర సిబ్బంది అందరితో కలిపి ఫోటోలు కి ఫోజులు ఇచ్చాడు. హాస్పిటల్ బెడ్ మీద నుండే సెల్ఫీ ఫోటోతో స్టిల్స్ ఇచ్చాడు చంద్రబాబు. ఇదంతా జనం మర్చిపోయారు అనుకున్నాడో ఏంటో రామోజీ అట్లాగే బురద జల్లుతూ నీతి వాక్యాలు వల్లించాడు.
అయితే ఇది సోషల్ మీడియా యుగం అన్న సంగతి రామోజీకి గుర్తు లేదనుకుంటా… జర్నలిజం ముసుగులో చేసే ప్రతి తప్పుడు ప్రచారానికి ఆధారాలతో కూడిన సమాధానం నిమిషాల్లో చెప్పే జనం ఉన్న యుగం.. అందులోనూ దేశంలోనే బలమైన వ్యవస్థగా పేరుగాంచిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా రామోజీ అలా తప్పుడు వార్త ప్రచురించాడో లేదో ఇలా చంద్రబాబు ఘటన తాలూకా వాస్తవాలను ఫోటోలతో సహా సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేశారు. రామోజీ రాసే తప్పుడు రాతలపై సోషల్ మీడియా వేదికగా ఉక్కుపిడికిలి బిగించారు. ఇప్పటికైనా రామోజీ గురువింద నీతులు మానుకుంటే మంచిదని పరోక్షంగా హెచ్చరించారు.