పాయసం ముద్దలాగా కాకుండా పలావులా పొడిపొడిగా కావాలంటున్న ఈనాడు.
ప్రభుత్వం నాణ్యత లేని బియ్యాన్ని సరఫరా చేస్తున్నందు వలన ప్రభుత్వ పాఠశాలల్లో భోజనం రుచికరంగా లేదని తీపి పొంగలి ముద్దలా ఉందని అందుకే కొందరు పిల్లలు ఇంటి వద్ద నుండీ భోజనం తెచ్చుకొన్నారంటూ ఒక వార్త ప్రచురించింది ఈనాడు పత్రిక.
నిజానికి వైసీపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టత్మాకంగా తీసుకొన్న పధకం జగనన్న గోరుముద్ద. ఈ పధకంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలోని పిల్లలకి దేశంలోని ఇతర రాష్ట్రాల కన్నా మిన్నగా, నాణ్యమైన,విభిన్న రుచులతో కూడిన మధ్యాహ్న భోజనాన్ని అందిస్తుందని చెప్పవచ్చు .
అంతేకాదు బీద విద్యార్థులకు పౌష్టికాహార లోపంతో వచ్చే ఐరన్, ఇతర విటమిన్ లోపాలు రాకుండా భోజనంతో పాటు గుడ్డు స్నాక్స్ గా పల్లి చిక్కీ, ఎనర్జీ డ్రింక్ గా రాగి జావ అందిస్తుంది జగన్ ప్రభుత్వం .
గత టీడీపీ ప్రభుత్వం మధ్యాహ్న భోజనం పధకానికి అయిదేళ్లలో 450 కోట్లు ఖర్చు చేస్తే. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం మధ్యాహ్న భోజనం, స్నాక్స్, ఎనర్జీ డ్రింక్స్ కోసం యాడాదికి 700 కోట్లు చొప్పున గత అయిదేళ్లలో 6995 కోట్లు వెచ్చించి అత్యంత భాద్యతతో నిర్వహిస్తుంది ఈ గోరు ముద్ద పధకాన్ని .
ఈ కృషిని గుర్తించిన కేంద్ర స్త్రీ శిశు సంక్షేమం శాఖ బీద విద్యార్థుల్లో రక్త హీనత నివారణకు చేస్తున్న కృషిలో జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రంగా గుర్తించి అవార్డు, ప్రశంసా పత్రం ప్రధానం చేసింది కేంద్ర ప్రభుత్వం .
ఈ అంశాలేవి పరిగణనలోకి తీసుకోని ఎల్లో మీడియా వైసీపీ ప్రభుత్వాన్ని అభాసు పాలు చేయడానికి అల్లే కట్టుకథలకి ఉదాహరణ పొంగలి ముద్దలా ఉందంటూ రాసిన పిచ్చి వార్త .
తీపి పొంగలి ముద్దలాగా కాకుండా పఠాన్ పలావులాగా, బిలాల్ బిర్యాని లాగా పొడి పొడిగా వండే వంట గాళ్ళు బహుశా భారత దేశంలో లేరేమో . ఉంటే గింటే రామోజీనే . ఆ టెక్నీక్ ఏంటో ప్రపంచానికి పరిచయం చేస్తే బాగుణ్ణు.