కనీసం ఒక సంవత్సరం కూడా ఎన్నికైన వైకాపాలో ఉండకుండా టీడీపీ చంకనెక్కి ఢిల్లి వేదికగా చేసుకుని జగన్మీదా, జగన్ ప్రభుత్వం మీదా విపరీతమైన రీతిలో విమర్శలు చేసి, తన రాజకీయ భవిష్యత్తును చేజేతులారా నాలుగేళ్ళ పాటు పాడుచేసుకున్న రఘురామ కృష్ణంరాజు, ఆపై పదవీకాలం చివరకు వచ్చేసరికి వైకాపాకు రాజీనామా చేసి టీడీపి తో జత కట్టారు.
తనకు సుదీర్ఘమైన రాజకీయానుభవం ఉన్నా కూడా చంద్రబాబును గుడ్డిగా నమ్మడం అనే భారీ తప్పును చేసిన రఘురామకు ఇప్పుడు పశ్చాత్తాపం పడవలసిన సమయం వచ్చేసింది. మొన్నటికి మొన్న అమిత్‌షా ఇంట్లోకి అనుమతి లేకపోవడంతో ఇంటి బయటే నిలిచిపోయిన రఘురామను వీసమెత్తు కూడా పట్టించుకోకుండా లోపలికి వెళ్ళిపోయిన చంద్రబాబు, పవన్‌లు ఇప్పుడు యంపీ స్థానాల వివరాలు వెలువరించడంలో కూడా పాపం అలానే పక్కన పెట్టేసారు.
నిన్న విడుదల అవబోవు యంపీ లిస్టు అంటూ వచ్చిన లిస్ట్‌లో రఘురామ పేరు లేకపోవడం, బీజేపీ టీడీపీ కూడా రఘురామను లెక్కలోకి వేసుకోకపోవడంతో పాపం రఘురామ తన విగ్గు తీసి బుర్ర గోక్కునే పరిస్థితి దాపురించింది. ఇకపై తన పేరు ఉంటుందో ఉండదో, రాజకీయంగా భవిష్యత్తు ఏమైపోతుందో అంటూ బెంగ పెట్టుకొన్నారు రఘురామ కృష్ణంరాజు.
తనంతటి దిగ్గజ విశ్లేషకుడు, రెబెల్ రాజకీయ నాయకుడినే చంద్రబాబు ఆక్ పాక్ కరివేపాక్ అన్నారంటే… బాబు మామూలోడు కాదని రఘురామకి అర్థమయ్యే ఉంటుంది పాపం.
బిజేపి ఎంపీ అభ్యర్థుల అంచనా
1)నరసాపురం- మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు లేదా శ్రీనివాస వర్మ,
2)రాజమండ్రి- పురంధేశ్వరి,
3)అనకాపల్లి- సీఎం రమేష్,
4)రాజంపేట- కిరణ్ కుమార్ రెడ్డి,
5)తిరుపతి- మాజీ ఐఎఎస్ వరప్రసాద్ లేదా రత్నప్రభ పేర్లు ప్రచారం.
6)అరకు- కొత్తపల్లి గీత,