అంతన్నాడింతన్నాడే రామరాజు….
పులివెందుల సభ అన్నాడే కృష్ణరాజు…
నా సత్తా చూడమన్నాడే విగ్గు రాజు…
చూపకుండ నాన్చుతున్నాడే సీటు లేని రాజు.
అని పాపం పులివెందుల ప్రజలు పాడుకుంటున్నారు. కరోనా వచ్చి ప్రజల టైము బాగోనపుడు, ఢిల్లీలో గెస్ట్ హవుసుల్లో కుర్చుని… పదే పదే యూట్యూబు లైవులకి వచ్చి…. విపరీతంగా విశ్లేషణలు చేసిన టైములో పాపం అప్పటి యంపీ రఘురామ కృష్ణంరాజు పులివెందుల ప్రజలకి భారీ ఆఫర్ ప్రకటించారు.
వైసీపీ కి భయపడి నాలుగేళ్ళు ఢిల్లీలోనే ఉండిపోయినపుడు, సొంత నియోజకవర్గంలో మీ అభిమానులు ఏమైపోవాలి అని నెటిజన్లు అడిగిన ప్రశ్నకి సమాధానంగా రఘురామ… “తనకు గోదావరి జిల్లాల్లో మాత్రమే కాదనీ, రాయలసీమలోనూ ఫాన్సు ఉన్నారనీ… పులివెందులలో పది వేల మందితో భారీ సభ పెడతాననీ, దానికి కనుక వైసీపీ అడ్డు వస్తే క్షమించబోననీ” పాపం ఉత్తర కుమార ప్రగల్భాలు పలికారు రఘురామ.
కాలం గిర్రున తిరిగి పాపం తన నియోజకవర్గానికే తాను వెళ్ళలేని పరిస్థితి నెలకొనగా… కష్టపడి పదవీకాలం అయిపోయాక నరసాపురంలో అడుగు పెట్టారు. ఇప్పుడు అక్కడ నుంచీ సీటు కూడా రాని తరుణంలో మరి ఏం చేయాలో పాలుపోవట్లేదు కనుక… అప్పుడు మాట ఇచ్చి మరిచిపోయారు కనుక ఆ బాకీ ఏదో ఇప్పుడు పులివెందులలో సభ పెట్టి తీర్చితే… తన బల ప్రదర్శన కూడా అవుతుంది కనుక… కావాలంటే పులివెందుల ఎమ్మెల్యే సీట్లో యంపీ సీటో అడగొచ్చని పాపం రఘురామ కృష్ణంరాజు ని జనం ఎగతాళి చేస్తున్నారు. ఇంకెందుకు, ఎలానూ వీడియోలు వదిలి టైము వేస్టు చేస్తున్నారు కనక ఆ పనేదో చేస్తే ఓ పనయిపోతుంది కదా!!!