పనీ పాటా లేకుండా పడున్న సచివాలయ ఉద్యోగులట. నిన్నటి వరకు వాలంటీర్ల మీద ఏడ్చి వారి విధుల నుండి వారు దూరం జరిగేలా చేసిన పచ్చ బ్యాచ్, ఇప్పుడు సచివాలయ ఉద్యోగుల మీద పడ్డారు.
జగన్ అధికారంలోకి వచ్చాకా అసలు ప్రభుత్వ ఉద్యోగాలే ఇవ్వలేదని అన్నం తినే నోటితోనే అంత పెద్ద అబద్ధం ఆడే బాబు అండ్ కో, ఎల్లో మీడియా సడన్ గా సచివాలయ ఉద్యోగులు 1.35 లక్షల మంది ఉన్నారనే విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకున్నారు.. వాలంటీర్లు ఇంటివద్దకు వెళ్లి పెన్షన్ ఇవ్వడానికి వీలు లేదని ఆదేశాలు వచ్చేలా చేసి, అది కాస్తా బ్యాక్ ఫయిర్ అవ్వడం తో, లేదు లేదు ఇంటివద్దకే వెళ్లి ఇవ్వాలి దానికోసం లక్షా ముప్పై ఐదువేల సచివాలయ ఉద్యోగులను వాడుకోవాలని బాబు మొదలు టీడీపీ నాయకులంతా, ఈనాడు మొదలు ఎల్లో మీడియా అంతా గగ్గోలు పెడుతుంది. ఇక ఈనాడు అయితే రాష్ట్రం లో ఎంతమంది సచివాలయ ఉద్యోగులు ఉన్నారు? రాష్ట్రంలో పెన్షన్ దారులు ఎంతమంది? ఒక్కో సచివాలయ ఉద్యోగి ఎంత మంది పెన్షన్ దారులకు పెన్షన్ ఇవ్వాల్సి వస్తుంది. అలా ఇస్తే ఎన్ని రోజుల్లో ఆన్షన్ ఇవ్వొచ్చో ఇంజనీరింగ్ కాల్సీ లెక్కలు ప్రింట్ చేసింది.. మొన్నటి వరకు ఇదే పత్రిక జగన్ ప్రభుత్వ ఉద్యోగాలే ఇవ్వలేదంది. సచివాలయ వ్యవస్థ ఓ అర్థం లేనిది అని కూసేది..
ఇక రఘురామ కృష్ణం రాజనే పని లేని పొలిటీషియన్, అసలు సచివాలయ ఉద్యోగులకు ఏ పనీ లేదని, ఏడాదంతా ఖాళీగానే ఉంటారని వాళ్ళ చేత పెన్షన్ ఇప్పించండి అంతేగాని అవ్వా తాతా పెన్షన్ రాకపోవడానికి బాబే కారణం అని చెప్పొద్దని మిమిక్రీ చేసి మరీ సచివాలయ ఉద్యోగులను అవామనపరచాడు. ఎంపీ గా గెలిచి ప్లేట్ ఫిరాయించిన నాటి నుండి కనీసం ఒక్కసారి కూడా నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడని ఆయన, గ్రామాల్లో సచివాలయాలు ఎలా పనిచేస్తున్నాయి, అందులో ఎంత మంది ఉద్యోగుల ఏ ఏ పనులకు కేటాయించబడ్డారు, వారు ఎంత పని చేస్తున్నారు అనే కనీస అవగాహన లేకుండా తన నోరు పారేసుకున్నాడు. ఇది కేవలం తన వద్ద డబ్బు ఉందనే పొగరు తప్ప మరేదీ కాదు. ఎవరిని పడితే వారిని నోటికి ఎంతమాట వస్తే అంత మాట మాట్లాడుతూ సభ్యసమాజంలో ఉండటానికి అనర్హత పొందాడు తను.