ఒకవైపు చంద్రబాబు నాయుడు తెలుగు తమ్ముళ్ళలో కానరాని కసిని, ఎన్నికల స్ఫూర్తిని రగిలించడానికి ఆపసోపాలు పడుతూ ఇక్కడ “రా…. కదలి రా…” పేరుతో ఎన్నికల సభలను నిర్వహిస్తుంటే, మరొక పక్క రోజుకో కేసు విషయంలో చంద్రబాబును కోర్టులు కూడా రా కదిలి రా అంటూ నోటీసులు పంపుతున్నాయి.
చంద్రబాబు హయాంలో ఇన్నర్ రింగ్ రోడ్ విషయంలో జరిగిన కుంభకోణమై కేసులు నమోదైన విషయం విదితమే. అయితే అప్పటికే చంద్రబాబు స్కిల్ స్కామ్ కేసులో లోపల ఉండటం, ఢిల్లీ నుండి వచ్చిన న్యాయవాదులతో నెలరోజులు తిరిగేసరికి అబ్బిన తెలివితేటలతో, రకరకాల కారణాలను చూపుతూ ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో అరెస్టు కాకుండా బెయిలు కోరుతూ హైకోర్టుకు అప్పీలు చేసుకున్నారు. హైకోర్టు ముందస్తు బెయిలు కూడా జారీ చేసింది.
అయితే ఈ ముందస్తు బెయిల్ తీర్పును సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ కేసు విచారణ ఈ సోమవారం సుప్రీం కోర్టుకు ముందుకు రావడంతో, విచారణకు హాజరు అవమంటూ చంద్రబాబు కు సుప్రీం కోర్టు నుండి నోటీసులు అందాయి.