‘నా మరిది ఎన్ని దుర్మార్గాలైనా చేయని.. అది పెద్ద విషయం కాదు. ఆయన కళ్లలో ఆనందమే నా లక్ష్యం’ ఈ ధోరణలో సాగుతున్నారు ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి. పింఛన్ల విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ రాజకీయాలు చేస్తోందని ఆమె ఆరోపించారు. 2019కి ముందు వలంటీర్ల వ్యవస్థ లేనప్పుడు కూడా పింఛన్లు అందించారని వ్యాఖ్యానించారు.
పురందేశ్వరి ప్రస్తుతం పూర్తిగా చంద్రబాబు చేతిలో కీలుబొమ్మలా మారిపోయింది. అందుకే పింఛన్ల విషయంలో ఆయన చేసిన అరాచకాలు ఆమెకు కనిపించడం లేదు. బాబు తన మనిషి అయిన నిమ్మగడ్డ రమేష్ ద్వారా ఎన్నికల కమిషన్కు లేఖ రాయించి వలంటీర్లు పింఛన్లు పంపిణీ చేయకుండా అడ్డుకున్న విషయం తెలిసిందే. ఇతను మొదటి నుంచి టీడీపీ మనిషే. స్థానిక సంస్థల ఎన్నికలను రాజకీయం చేసి బాబుకు లబ్ధి చేకూర్చేలా వ్యవహరించాడు. ఇలాంటి వ్యక్తి పెన్షన్లు విషయంలో దారుణంగా వ్యవహరిస్తే దానిని ప్రస్తావించకుండా ప్రభుత్వంపై బురద వేస్తున్నారు.
ఈనెల సచివాలయాల ద్వారా పింఛన్లు ఇవ్వకుండా బ్యాంకుల్లో నగదు జమ చేయించాలని మరోసారి నిమ్మగడ లేఖ రాయగా ఈసీ అదేవిధంగా ఆదేశించింది. వృద్ధులు, దివ్యాంగులను ఇబ్బంది పెట్టడం ఏ మాత్రం బాగోలేదని చంద్రబాబు, నిమ్మగడ్డను అనకుండా సీఎం జగన్పై ఆమె ఏడుస్తున్నారు. బీజేపీ విధానాలు ఎలా ఉన్నాయో కానీ పురందేశ్వరి మాత్రం తన మరిది చెప్పినట్లు ఆడుతున్నారు.
2019కి ముందు పింఛన్లు పంపిణీ జరగలేదా అంటూ ఆమె ప్రశ్నించారు. ఆ సమయంలో లబ్ధిదారులు పడిన ఇబ్బందులను ఏనాడూ ఆమె దృష్టికి రాలేదా.. లేక అప్పుడుంది టీడీపీ ప్రభుత్వం కదా అని వేరేలా మాట్లాడుతున్నారో.. పింఛన్లు తీసుకోవడానికి వృద్ధులు, దివ్యాంగులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు నాడు నరకయాతన చూశారు. జగన్ ఈ పరిస్థితిని తప్పించారు. వలంటీర్లే నేరుగా ఇళ్లకు వెళ్లి అందించారు. ఇప్పుడు పచ్చ గ్యాంగ్ లేఖలు రాయించి లబ్ధిదారులను ఇబ్బంది పెడుతూ ఇదంతా ప్రభుత్వ కుట్ర అంటే నమ్మేందుకు ఇక్కడెవరూ చెవుల్లో పూలు పెట్టుకోలేదు చిన్నమ్మా..