వైయస్సార్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారిని గెలిపించాలని కోరుతూ సినీ నిర్మాత దిల్ రాజు గారు చేసిన ఒక వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. సదరు వీడియోలో దిల్ రాజు గారు మాట్లాడుతూ బాలినేనికి శ్రీనివాస్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ, విభజన అయిన రాష్ట్రంలో కానీ 5సార్లు ఒంగోలు నుంచి ఎమ్మెల్యే గా ప్రాతినిధ్యం వహించి ఒంగోలుని డెవలపమెంట్ పరంగా ఎంతో ముందుకు తీసుకుని వెళ్ళారని అలాగే వైయస్సార్ గారి హయాంలో మంత్రిగా చేసి వారి శాఖ ద్వారా ఎంతో అభివృద్ది చేశారని ఇప్పుడు జగన్ గారి సారధ్యంలో మంత్రివర్యులుగా వారి శాఖను ఎంతో ముందుకు తీసుకుని వెళ్ళారని చెప్పారు.
ప్రస్తుతం మళ్ళీ బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు ఓంగోలు నుండి శాసన సభ్యులుగా 6వ సారి పోటీలో ఉన్నారని తప్పకుండా ప్రజలు తమ అమూల్యమైన ఓటుని బాలినేనిగారికే వేసి గెలిపించాలని తాను కోరుకుంటునట్టు వీడియో ప్రకటనలో తెలిపారు. అలాగే ఈ మధ్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డిగారిపై యూట్యూబ్ లో ఒక డాక్యుమెంటరీ విడుదలైందని, అందులో వారి రాజకీయ ప్రస్తానం ఎలా మొదలు పెట్టారని , నాయకుడిగా వారు ఎదుగుతూ నియోజకవర్గాన్ని ఎలా ముందుకు తీసుకుని వెళ్లారో ఆ డాక్యుమెంటరీలో ఉందని అందరు తప్పక సదరు డాక్యుమెంటరీ ఫిలిం ని చూసి ఓటు వేసే నిర్ణయం తీసుకోవాలని తాను ఆకాంక్షిస్తునట్టు చెప్పారు.