‘ఎన్నడూ లేని విధంగా సంక్షేమ పథకాల రూపంలో రూ.2.70 లక్షల కోట్లు మీకు అందించేందుకు 130 సార్లు బటన్ నొక్కా. ఒక్క రూపాయి లంచం లేకుండా, వివక్షకు తావు లేకుండా అందించిన ప్రభుత్వానికి మద్దతు ఇవ్వండి. మీ బిడ్డ కోసం రెండు బటన్లు ఫ్యాన్ గుర్తు మీద నొక్కండి. ఇందుకు మీరంతా సిద్ధమేనా..’ అన్నారు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి. గుంటూరు జిల్లా ఏటుకూరులో శుక్రవారం నిర్వహించిన మేమంతా సిద్ధం బహిరంగ సభలో అశేష జనవాహిని మధ్య సీఎం ప్రసంగించారు.
టీడీపీ, బీజేపీ, జనసేనలు 2014లో కూటమి కట్టి వచ్చారు.∙మేనిఫెస్టో పేరుతో రంగు రంగుల కాగితాలతో ప్రజల జీవితాలతో చెలగాటం ఆడారు. బాబు సంతకం పెట్టి మోదీ, దత్తపుత్రుడి ఫొటోలతో ప్రతి ఇంటికీ ఇదే పాంప్లెట్ పంపించాడు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5లో యాడ్స్ వేసి ఊదరగొట్టారు. రైతు రుణమాఫీపైæ సంతకం చేస్తానన్నాడు. రూ.87,612 కోట్లు మాఫీ అయ్యాయా?, పొదుపు సంఘాల రుణాలు పూర్తిగా రద్దు చేస్తామన్నాడు. రూ.14,205 కోట్ల రుణాల్లో కనీసం ఒక్క రూపాయి అయినా మాఫీ చేశాడా?, ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాక్ష్మి పథకం కింద రూ.25 వేలు బ్యాంకులో డిపాజిట్ చేస్తామన్నాడు. రూ.25 వేల కథ దేవుడెరుగు. కనీసం ఒక్క రూపాయి డిపాజిట్ చేశాడా?, ఇంటింటికీ ఓ ఉద్యోగం ఇస్తాం, లేకపోతే రూ.2 వేలుS నిరుద్యోగభృతి అన్నాడు. ప్రతి ఇంటికీ రూ.1.20 లక్షలు ఇచ్చాడా?, అర్హులందరికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇళ్లు అన్నాడు. సెంటు స్థలమైనా ఇచ్చాడా?, రూ.10 వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్, చేనేత, పవర్ లూమ్స్ రుణాల మాఫీ, ఉమన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అన్నాడు. సింగపూర్‌కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు జరిగిందా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు. మీ గుంటూరులో ఏమైనా కనిపిస్తోందా?, ప్రత్యేక హోదా వచ్చిందా.. అడుగుతున్నాను. మళ్లీ వారంతా కలిసి ఏకమై మోసం చేసేందుకు కొత్త కొత్త హామీలతో వస్తున్నారు. నమ్ముతారా? సూపర్ సిక్స్ అట, సూపర్ సెవెన్ అట. నమ్ముతారా? ఆలోచన చేయమని కోరుతున్నా.
ఈ రాష్ట్ర చరిత్రలో ఏ ఒక్క ప్రభుత్వం కూడా గతంలో చేయనంతగా ప్రతి గ్రామంలోనూ పనులు చేశాం. పౌర సేవల్ని అందుబాటులోకి తెచ్చాం. చంద్రబాబు మోసాలకు, ప్రజలకు మధ్య జరగబోతున్న ఎన్నికల యుద్ధమిది. ఇంటింటికీ పెన్షన్ అందించిన ప్రభుత్వానికి, దాన్ని ఆపిన బాబు దుర్మార్గానికి మధ్య జరుగుతున్న కురుక్షేత్రం ఇది. వారి మోసాలకు, మనకున్న విశ్వసనీయతకు మధ్య జరుగుతున్న యుద్ధం. బాబు, దత్తపుత్రుడు, పురందేశ్వరి కలిసి రోడ్ల మీద అబద్ధాలు చెప్పడం మొదలు పెట్టారు. ఈ 58 నెలల పాలనలో ఏరకంగా మీ బిడ్డ మీ జీవితాల్లో మార్పులు తీసుకొచ్చాడో చూడండి. ఆలోచన చేయమని మీ అందరితో ప్రతి అడుగులోనూ కోరుతూ వచ్చాను.
ఇంటికి వెళ్లాక ఆలోచన చేయండి. మీ బిడ్డకు ఓటు వేయడం అంటే ఈ 58 నెలలుగా మీకు జరుగుతున్న మంచికి ఓటు వేస్తున్నారని లెక్క. చంద్రబాబు నాయుడికి ఓటు వేయడమంటే జరుగుతున్న మంచిని ఇక మాకు వద్దు అని ఓటు అన్నట్లు లెక్క. ఈరోజు ఒక్కటే చెబుతున్నాను. 58 నెలల క్రితం ఏమైతే చెప్పానో అవన్నీ చేశాను.
పేదల భవిష్యత్తును కాపాడుకునే ఈ యుద్ధంలో మీరంతా భాగస్వామ్యులు కావాలి. ప్రతి ఇంటి నుంచి ఒక స్టార్ క్యాంపెయినర్ బయటకు తీసుకొచ్చి వచ్చి జరుగుతున్న మంచి కొనసాగాలంటే జగన్ రావాలని చెప్పాలి. వలంటీర్లు మళ్లీ ఇంటికే రావాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు, వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లల చదువులు, బడులు బాగుపడాలన్నా ఫ్యాన్ గుర్తుపై రెండు బటన్లు నొక్కాలి. పాలకుడు మోసగాడైతే మన బతుకులు అంధకారమయం అవుతాయి. పిల్లల జీవితాలు చిన్నాభిన్నం అవుతాయి. అక్కచెల్లెమ్మల బతుకులు అతలాకుతలం అవుతాయి. రైతన్నల జీవితాలు మోసపోయి ఆత్మహత్యల పాలవుతాయి అన్న, అవ్వాతాతల సంక్షేమం అడుగంటి పోతుందన్న వాస్తవాలు ప్రతి ఇంట్లో కూడా చర్చ జరగాలి. వైఎస్సార్సీపీ అభ్యర్థులకు మీ అందరి ఆశీస్సులు అందించండని కోరారు .