ఇటీవల కాలం వరకూ జనసేన పార్టీ కోసం అహర్నిశలు శ్రమించి తన శక్తి సామర్థ్యాలకు మించి పని చేసిన పోతిన మహేష్ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి సీటు ఆశించిన సంగతి మనందరికీ తెలిసిందే.. అయితే నమ్మిన వ్యక్తుల్ని నట్టేట ముంచి టిడిపి జనసేన బిజెపి ఉమ్మడి పొత్తులో భాగంగా ఆస్తులు సైతం అమ్ముకుని జనసేన పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన నాయకుల్ని పక్కన పెట్టిన పవన్ కళ్యాణ్ తనకి ప్యాకేజీ ఇచ్చే టిడిపి బిజెపి నాయకులకు మాత్రమే సీట్లు కేటాయించినటువంటి నేపథ్యంలో తన సొంత సామాజిక వర్గం నుంచే తీవ్రమైన వ్యతిరేకత ఎదురైనటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం…
అందులో భాగంగానే జగ్గంపేట నియోజక వర్గం నుంచీ పాఠం శెట్టి సూర్యచంద్ర కావచ్చు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి సీట్ ఆశించిన పోతున్న మహేష్ కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రం నలుమూల తమ ఒళ్ళు గుల్ల చేసుకొని పది ఏళ్ళుగా జనసేన జెండాని భుజం మీద పెట్టుకొని నడుస్తూ, తమ ఆస్తులు సైతం తృణప్రాయంగా కరిగించుకుంటూ జనసేన జెండా ఎగరాలి పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలి అనే ఒకే ఒక నినాదంతో ముందుకు నడిచిన అనేకమంది ముఖ్యంగా కాపు సమాజానికి సంబంధించిన నేతలు పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యభిచారం మూలంగా రోడ్డును పడిన పరిస్థితిని మనం ఈరోజు చూస్తూ ఉన్నాం… రాష్ట్రం నలుమూలల నుండి పవన్ కళ్యాణ్ కోసం పనిచేస్తున్న నేతల తీరు ఒక ఎత్తు అయితే… విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుండి వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా టీవీ ఛానల్ లో పత్రికల ద్వారా తన వాణి వినిపిస్తూ స్థానికంగా జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు పరిచయం చేస్తూ కాళ్లకు చక్రాలు కట్టుకొని తిరిగిన పోతున మహేష్ పరిస్థితి ఒక ఎత్తు..
కానీ ఈరోజు తనకు జరిగిన అన్యాయం, పవన్ కళ్యాణ్ చేసిన అరాచకం దృష్టిలో పెట్టుకొని పార్టీని వీడిన పోతిన మహేష్ వైసీపీ కండువా కప్పుకుని పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు . తను నమ్మి నడిచిన నాయకులకు న్యాయం చేయలేని పవన్ కళ్యాణ్.. ఒకటికి మూడుసార్లు పెళ్లి చేసుకుని ఒక భార్యతో కూడా కలిసి కలకాలం జీవించలేని పవన్ కళ్యాణ్.. ఒక ఆడబిడ్డని పెళ్లి చేసుకుని పిల్లలు ఉండగానే మరొక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని పిల్లలను కన్న పవన్ కళ్యాణ్.. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడటం లో ఏమాత్రం అర్థం ఉంది? ఆయన మాటలకు ఎంత మాత్రం క్రెడిబుల్టి ఉంది అని ప్రశ్నిస్తున్నారు..
పెళ్లి పిల్లలు సంసారం అనేది వ్యక్తిగతం కావచ్చు గాక! కానీ పెళ్లి పెళ్ళాం పిల్లలు ఉండగానే మరొక ఆడబిడ్డతో పిల్లల కనడం అనేది సమాజం హర్షించే విషయం కాదు.. రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మన దైనందిన జీవితంలో జరిగే ప్రతి అంశం కూడా ప్రజలకు తెలియాల్సిందే.. మన వ్యక్తిగత వృత్తి గత జీవితం మీద ఆధారపడే మన నాయకత్వం మీద ఒక అంచనా ఉంటుంది అనేది మనకు తెలుసు ప్రజలకు తెలుసు.. ఇలాంటి పరిస్థితులలో పోతిన మహేష్ లాంటి నాయకులు ఎంతగా అవమానించబడి ఉంటారు అనేది మనం కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం. అదే కార్యక్రమంలో పిఠాపురంలో కూటమి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్.. తన సీటును తానే గెలిపించుకోలేని స్థితిలో ఉన్న పవన్ కళ్యాణ్.. వర్మ కాళ్లు పట్టుకుని వెంపర్లాడటంలో అర్థం ఏముంది ఇదే నా పవన్ కళ్యాణ్ నాయకత్వం అంటూ విమర్శలు గుప్పించారు.
పవన్ కళ్యాణ్ చంద్రబాబు చెప్పుల్లో కాళ్లు పెట్టి నడిచినంతకాలం ప్రజలు పవన్ కళ్యాణ్ ని నమ్మే పరిస్థితిలో లేరని, ఒకవేళ గుడ్డిగా నమ్మిన ఓటు వేసే టయానికి మాత్రం కచ్చితంగా ఆలోచనలో పడతారనేటువంటి విషయాన్ని పోతిన మహేష్ స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ రాజకీయం కేవలం చంద్రబాబుకు మేలు చేయాలని అటువంటి ఆలోచన తప్పితే ప్రజలకు ఏమాత్రం మంచి చేయాలి అనేటువంటి సంకల్పం లేదని స్పష్టం చేశారు. ఒక రకంగా చెప్పాలి అంటే జనసేన పార్టీ అనేది కేవలం టిడిపికి బీ టీం పార్టీ లాంటిది మాత్రమే తప్పితే జనానికి మంచి చేయాలనో రాష్ట్రానికి ఉపయోగపడాలని ఆలోచనతో పెట్టిన పార్టీ ఎంత మాత్రం కాదు అని తేటతెల్లం చేశారు. ఏది ఏమైనా జనసేన కోసం ప్రాణం పెట్టి పనిచేసిన ఇలాంటి నాయకుల్ని పక్కన పెట్టడం పవన్ కళ్యాణ్ కి భవిష్యత్తు రాజకీయాల్లో ఎప్పటికైనా పొంచి ఉన్న ప్రమాదమే తప్ప ఏమాత్రం మేలు కాదు జరగదు అనేది వాస్తవిక పరిస్థితులను దృశ్య అర్థమవుతున్నటువంటి విషయం.