జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను విమర్శించేందుకు సినీ ఇండస్ట్రీ వాళ్లు భయపడుతుంటారు. అయితే నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి మాత్రం వెనకడుగు వేయరు. సేనాని చేసే పనులను చాలాకాలంగా ఏకిపారేస్తున్నారు. తాజాగా ఆయన మీడియా ముందు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈనాడు రామోజీరావు గతంలో పవన్ వ్యక్తిగత విషయాలను ప్రచారం చేసి అన్‌పాపులర్ చేశారని విమర్శించారు. ఈ విషయాన్ని ఆయన మర్చిపోయినట్లు ఉన్నారని చెప్పారు. చంద్రబాబు దగ్గర కాపులను ఎందుకు తాకట్టు పెడుతున్నావని పవన్‌ను నిలదీశారు.
ఆ సామాజిక వర్గంలో ముఖ్యమంత్రులుగా పనికొచ్చేవారే లేరా అని ప్రశ్నించారు. బాబుపై కూడా పోసాని విరుచుకుపడ్డారు. కుట్రలు పన్ని ఎన్టీఆర్ నుంచి పార్టీని లాక్కున్నాడని చెప్పారు. వంగవీటి రంగాను హత్య చేయించింది బాబు కాదా?.. ఇప్పుడేమో నీతులు చెబుతున్నాడు. పచ్చిగా మాట్లాడటం తప్పుకాదు.. అబద్ధం చెప్పడం తప్పని అన్నారు. రామోజీ కంటికి చంద్రబాబు నీతిమంతుడిలా కనపడటం విడ్డూరంగా ఉందన్నారు. బాబు అవకాశవాదని, స్వలాభం కోసం ఎవరి కాళ్లయినా పట్టుకుంటాడన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజల్లో గుండెల్లో ఉన్నారన్నారు.
జగన్ మళ్లీ సీఎం అయితే ఏమైపోతామోనని రామోజీకి, బాబుకు భయంగా ఉందన్నారు. ఎవరి డబ్బుతో రామోజీ మార్గదర్శి పెట్టారు? అందులోని డబ్బంతా రామోజీ పందికొక్కుల్లా తిన్నారని ఆరోపించారు. వలంటీర్లపై ఈనాడు విష ప్రచారాన్ని ఖండించారు. వారికి మానవత్వం, స్నేహభావం ఉందన్నారు. ఈనాడు పత్రిక టాయ్‌లెట్ పేపర్లా మిగిలిపోతుందని వ్యాఖ్యానించారు.