టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే పులి శాకాహారిగా మారడం ఎంత నిజమో చంద్రబాబులో మార్పు అంతే నిజమని మరోసారి స్పష్టంగా కనిపిస్తుంది. సత్యహరిశ్చంద్రుడికి అబద్ధాలు ఆడటం చేతకాదని, అలాగే చంద్రబాబుకు నిజాలు చెప్పడం తెలియదని, మొసలి కన్నీళ్లు, మోసపు మాటలతో ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకోవడమే చంద్రబాబు ఏకైక లక్ష్యమని బాబు ఎన్నికల ప్రచారాన్ని చూస్తున్న వారి నుండి వ్యక్తమౌతున్న అభిప్రాయాలు.
చంద్రబాబు 14ఏళ్ళ పాలనలో ఏనాడూ పేద, మధ్యతరగతి ప్రజలు, రైతులు, ఉద్యోగుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. 1994, 1999, 2014 టీడీపీ మేనిఫెస్టోలలో పేర్కొన్న రెండు రూపాయలకు కిలోబియ్యం, మద్యపాన నిషేధం, 50 లకే హార్స్పవర్ విద్యుత్, కోటి ఉద్యోగాలు, వంద కోట్లతో ధరల స్థిరీకరణ నిధి. జిల్లాకో మెడికల్ కళాశాల, రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫి, ఇంటికో ఉద్యోగం వంటి హామీలకు ఏ గతి పట్టిందో త్వరలో చంద్రబాబు వెలువరించే ఎన్నికల మేనిఫెస్టోకు అదే గతి పడుతుందనే అభిప్రాయం సామాన్యుల నుండి వ్యక్తమౌతుంది.
తాము అధికారంలోకొస్తే సూపర్ సిక్స్ పేరుతో ఉచితాలు అమలుచేస్తామని చంద్రబాబు చెబుతుండటం విడ్డూరంగా ఉంది. ఉచిత సిలిండర్ సంగతి దేవుడెరుగు, ఉన్న జగన్ పధకాలు గుంజుకు పోవడం ఖాయమన్న అభిప్రాయం ప్రజల్లో ఉంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల ప్రణాళిక పవిత్ర గ్రంథమైతే, చంద్రబాబుకు మాత్రం చిత్తు కాగితంతో సమానమనమని ఇప్పటికే నిర్ధారణ అయింది.
ఊసరవెల్లి మాదిరి తన స్వార్థం కోసం ఆలోచనలు, విధానాల్ని మార్చుకోవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని, ఎన్ని కపట నాటకాలు ఆడినా జనం మాత్రం తెలుగుదేశాన్ని నమ్మే పరిస్థితిలో ఇక లేరని. వచ్చే ఎన్నికల్లో మరోసారి తెలుగుదేశం ఘోర ఓటమి ఖరారైందని, చంద్రబాబు శంకరగిరి మాణ్యాలు పట్టడం ఖాయమని. రాజకీయంగా ఈ రాష్ట్రంలో ఇక చంద్రబాబు శకం ముగిసినట్టేనని ప్రజల నుండి వ్యక్తమవుతున్న అభిప్రాయం .