చంద్రబాబు నాయుడి సతీమణి భువనేశ్వరి చేపట్టిన రాజకీయ యాత్ర ముగిసింది. స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అడ్డంగా దొరికిపోయిన బాబు అరెస్ట్ కావడంతో వందలాంది మంది ప్రాణాలు వదిలారని ఎల్లో గ్యాంగ్ ప్రచారం చేసింది. ఆ సమయంలో రాష్ట్రంలో ఎవరు చనిపోయినా బాబు కోసమేనని ఖాతాలో వేసేసుకున్నారు. అరెస్ట్‌ను రాజకీయం చేసి లబ్ధి పొందాలని టీడీపీ ప్రయత్నించింది. ఇందులో భాగంగా భువనేశ్వరి గత సంవత్సరం అక్టోబర్ 25వ తేదీన చిత్తూరు జిల్లాలో నిజం గెలవాలి పేరుతో బస్సు యాత్ర చేపట్టారు.
ఆమె యాత్ర ఆరునెలలపాటు 14 విడతల్లో 47 రోజులపాటు సాగింది. 25 పార్లమెంట్ స్థానాల పరిధిలో 95 నియోజకవర్గాల్లో 203 కుటుంబాలను కలిశారని టీడీపీ ప్రకటించింది. చనిపోయిన ఒక్కో కార్యకర్త కుటుంబానికి రూ.3 లక్షల సాయం చేసినట్లు సోషల్ మీడియాలో పోస్టులు వేశారు. వాస్తవానికి నిజం గెలవాలి యాత్ర మొత్తం రాజకీయ కోణంలోనే సాగింది. వివిధ వర్గాలతో భువనేశ్వరి సమావేశమై చంద్రబాబు అది చేశాడు.. ఇది చేశాడని డబ్బా కొట్టారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంపై అబద్ధాలను ప్రచారం చేశారు. టీడీపీని గెలిపించాలంటూ క్యాంపెయినింగ్ నిర్వహించారు.
చంద్రబాబుకు ప్రజాబలం లేదు. ఇది జగమెరిగిన సత్యం. వ్యవస్థలను మేనేజ్ చేస్తూ రాజకీయాలు చేస్తున్నారు. ఇతర పార్టీల వల్లే ఆయన సీఎం అయ్యాడన్నది నిజం. బాబులో మానవత్వం కూడా శూన్యం. తన వల్ల పుష్కరాల్లో చనిపోతే జాలి కూడా చూపని వ్యక్తి. ఆనాటి పాపంలో భువనేశ్వరి పాత్ర ఉన్నా అయ్యో పాపం అనలేదు. నీచమైన మనస్తత్వం కలిగిన బాబు అవినీతి చేసి జైలుకి వెళ్తే ఆ బాధ తట్టులోకేక కార్యకర్తలు మరణించారంట. ఇతరుల చావులను కూడా ఎల్లో మీడియా తమ స్వార్థం కోసం వాడుకుంది. తటస్తులు అనారోగ్య కారణాలతో చనిపోతే అక్కడికి తెలుగు తమ్ముళ్లు వాలిపోయి.. వీరు టీడీపీ కార్యకర్తలని చెప్పండి. బాబు అరెస్ట్ కావడంతో ఆవేదనతో చనిపోయారని ప్రచారం చేయండని చెప్పారు. అందరూ పేదలు కావడంతో డబ్బు ఆశ పెట్టారు. బాబును జనసేతగా చిత్రీకరించేందుకు ఎల్లో మీడియా ఆగిన గుండెంలంటూ రోజూ కట్టుకథలు రాసింది. ప్లాన్ ప్రకారం భువనేశ్వరి రంగంలోకి దిగా నిజం గెలవాలంటూ యాత్ర చేపట్టారు. నారా వారు స్కిల్ డెవలప్మెంట్ పేరుతో దోచుకుంది నిజం. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా భువనేశ్వరి యథేచ్ఛగా యాత్ర చేశారు. బహిరంగంగా జనానికి డబ్బు పంచడం గమనార్హం.