మాజీ సీఎంలు చంద్రబాబు నాయుడు, నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌పై రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ముగ్గురు గురువారం రాయలసీమలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైఎస్సార్సీపీ ప్రభుత్వం, పెద్దిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. లేనిపోనివి చెప్పారు. ప్రధానంగా బాబు, కిరణ్‌కు పెద్దిరెడ్డితో రాజకీయ విభేదాలున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనపై అబద్ధాలు ప్రచారం చేశారు. తాము ఏం చేస్తామో చెప్పకుండా వ్యక్తిగత దూషణలకు దిగారు. దీంతో రామచంద్రారెడ్డి •పుంగనూరు నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో తనదైన శైలిలో స్పందించారు.
సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, నన్ను తిట్టడమే కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పని. వారికి మరో పని లేదు. ఈసారి ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో ఓటమి ఖాయమని తెలిసి బాబులో అసహనం పెరిగిపోయింది. అందుకే ఇష్టమొచ్చినట్లు మాట్లాడాడు. రాయలసీమ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్‌ను తరిమికొట్టాలన్నారు. వారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మా పార్టీ పుట్టింది రాయలసీమలోనే. ఈ ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడుతోంది ఒక్క జగన్ మాత్రమే. •బాబు 14 సంవత్సరాలపాటు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గానికి చేసిందేమీ లేదు. సాగునీటి సమస్యలను పరిష్కరించిన దాఖలాల్లేవు. మా ప్రభుత్వం హంద్రీ నీవా కాలువ పూర్తి చేసి నీరందిస్తే దానిపై విమర్శలు చేస్తున్నారు. జగన్ పనులు పూర్తి చేశారని చెప్పడానికి ఆయనకు బాధగా ఉంది. అందుకే పూర్తి కాలేదని అబద్ధాలు చెబుతున్నారు. కుప్పంలో గెలిచే పరిస్థితి లేదనే తిట్ల పురాణానికి తెర తీశాడు. సీఎం, తనపై చేస్తున్న వ్యక్తిగత విమర్శలను ప్రజలు గమనిస్తున్నారు. ఎన్నికల్లో ఓట్ల రూపంలో వారికి గుణపాఠం చెప్పడం ఖాయం.