పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే పార్టీ పెట్టాడో అప్పటినుండి రకరకాల బాధలతో ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయకుండా తెలుగుదేశం పార్టీని మరింత పైకి లేపేందుకు పవన్ ప్రయత్నం చేస్తూ ఉండటంతో పవన్ కళ్యాణ్ ని నమ్మి పార్టీలో చేరిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, రాజు రవితేజ లాంటి వాళ్ళు పవన్ సిద్ధాంతాలను విభేదించి పార్టీకి దూరమయ్యారు. వివిధ పార్టీలతో పొత్తు పెట్టుకోవడం తన పార్టీని స్థిరంగా నడపలేకపోవడం మొదలైన కారణాల వల్ల జనసేన పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయలేక పవన్ అష్టకష్టాలు పడుతున్నాడు.
ఇదంతా పక్కనబెడితే తాజాగా తనను కొందరు బ్లేడ్లతో కట్ చేస్తున్నారంటూ వారంతా ప్రత్యర్థి పార్టీకి చెందినవారంటూ కొత్త నాటకానికి పవన్ కళ్యాణ్ తెరలేపాడు. ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్స్ లో ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.. గతంలో ఇదే మాదిరిగా తనను చంపడానికి ఒక బ్యాచ్ దిగిందని పవన్ చేసిన ఆరోపణలు అవాస్తవాలని తేలడానికి ఎంతో కాలం పట్టలేదు.. ఇప్పుడు ఎన్నికల్లో సింపతీ కోసమే ఈ వ్యాఖ్యలు చేస్తున్నాడని అంటున్న వాళ్ళూ లేకపోలేదు.
గతంలో ఒకసారి పవన్ అభిమాని పరిగెత్తుతూ వచ్చి పవన్ కాళ్ళని లాగడంతో ఆయన స్టేజ్ పై అందరిముందు కింద పడిపోయారు. ఇప్పుడున్న మూడ్ లో అప్పుడు ఉండుంటే ఆ కాళ్ళు లాగిన అభిమాని ప్రత్యర్థి పార్టీకి చెందినవాడని పవన్ చెప్పేవాడేమో అని ప్రజలు నవ్వుకుంటున్నారు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ కి ఉన్న ఫ్యాన్ బేస్ చాలా పెద్దది. పవన్ ని తాకాలన్న ఉద్దేశ్యంతో తోపులాటలో ఆయన అభిమానులు రక్కేస్తూ ఉండొచ్చు.. ఫ్యాన్స్ ముసుగులో హీరోలను, హీరోయిన్లను చాలామంది ఇబ్బంది పెడుతూ ఉంటారని గతంలో పూరి జగన్నాథ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిన విషయాన్ని ఇప్పుడు తెరపైకి తీసుకొచ్చి పవన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తున్నారు..పవన్ కళ్యాణ్ తన అభిమానులను ఇకనైనా అదుపులో పెట్టుకోవాలని సూచిస్తున్నారు..