‘గాజు పగిలే కొద్దీ పదునెక్కుద్ది. కచ్చితంగా గుర్తుపెట్టుకో. గ్లాస్ అంటే సైజ్ కాదు సైన్యం. కనిపించని సైన్యం’ ఇది ఎప్పుడు విడుదలవుతుందో తెలియని పవన్ కళ్యాణ్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలోని డైలాగ్. రియాల్టీలో ‘గాజు గ్లాసు ఎవడబ్బ సొత్తు కాదు. గుర్తు పెట్టుకోండి ఎక్కడైనా.. ఎవరైనా వాడుకోవచ్చు. ఎవరు ఎంగిలి చేసినా శుభ్రంగా కడుక్కుని వాడొచ్చు’ అంటూ చెబితే ఎంతో వినసొంపుగా ఉంటుంది.
పవన్ పుణ్యాన జనసేన అనే నావ ఇంకా తెలుగుదేశం అనే తీరంలోనే కట్టేసి ఉంది. ప్రతి రాజకీయ పార్టీకి సింబల్ అనేది చాలా ముఖ్యం. ఈ విషయంలో సేనానికి పెద్దగా పట్టింపుల్లేవు. చంద్రబాబు నాయుడి నీడలో బతికేస్తూ గాజు గ్లాస్ గుర్తును తన పార్టీకి శాశ్వతంగా ఉంచేందుకు ఎన్నడూ ప్రయత్నించలేదు. ఎన్నికల సమయంలో మాత్రమే దాని గురించి ఆలోచించేవాడు. మొదటి నుంచి చూస్తే గ్లాసును ఎల్లో గ్యాంగ్ వాడేస్తోంది. ఈసారి కూడా అంతే.
గాజు గ్లాసును గతంలో ఎన్నికల కమిషన్ ఫ్రీ సింబల్ చేసింది. కాగా తాజాగా ఎన్నికల నేపథ్యంలో దానిని కామన్ సింబల్ చేస్తూ జనసేనకు కేటాయించారని, ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు వెళ్లాయని పచ్చ మీడియా ప్రచారం చేస్తోంది. అయితే అదంతా పుకారేనని తేలిపోయింది. జనసేన పోటీలో లేని చోట స్వతంత్ర అభ్యర్థులు కోరుకుంటే దానిని కేటాయించవచ్చని ఈసీ వర్గాలు స్పష్టం చేశాయి. కామన్ సింబల్ అంటూ వస్తున్న వార్తలు అవాస్తవని ధ్రువీకరించాయి. గ్లాసంటే సైన్యం.. కనిపించని సైన్యమని సేనాని సినిమా డైలాగ్ చెప్పాడు. కానీ ఆ సైన్యానికి దానిపై హక్కులు లేకుండా పోయాయి. దానిని ఎవరైనా వాడుకోవచ్చని ఈసీ చెప్పేయడంతో జనసైనికులు బోరుమని విలపిస్తున్నారు. అదేదో తమ పేటెంట్లా ఎక్కడికెళ్లినా దానితో బిల్డప్ ఇస్తుంటారు. ఇప్పుడు వారొక్కరే కాదు ఎవరైనా వాడుకోవచ్చని తెలియడంతో ఎంగిలి గ్లాస్ లెక్కన తయారైంది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల సభల్లో గాజు గ్లాసు సింక్లో ఉండాలన్నారు. ఎస్ నిజమే. సింక్లో ఉన్న దానిని కడిగి ఎవరైనా వాడేయొచ్చు. ఇది ఫలానా వారిది.. వారే వాడాలని ఏం లేదు.