రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కూటమిలో భాగంగా జనసేన 21 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తోంది. అసెంబ్లీ, పార్లమెంట్ రెండు కలిపి 23 స్థానాల్లో పోటీ చేస్తోంది. కానీ ఈ 23 స్థానాల్లో పోటీ చేయడానికి ఒక బీసీ నేత పవన్ కళ్యాణ్ కు దొరకలేదు అంటే అతిశయోక్తి కాదు. రిజర్వుడ్ స్థానాలు మినహా మిగిలిన అన్ని చోట్ల కాపు, కమ్మ సామాజిక వర్గాల నేతలే పోటీ చేస్తున్నారు. అర్థబలం ఉన్న నేతల కోసం బలహీన వర్గాల నేతలకు పవన్ కళ్యాణ్ హ్యాండ్ ఇవ్వడంతో ఇంకా ఆ పార్టీలో తమకు పురోగతి లేదని భావించిన బీసీ నేతలు పార్టీని ఒక్కక్కరుగా వీడుతున్నారు.
పవన్ మోసం చేయడంతో క్రిష్ణా జిల్లాలోని పలువురు బీసీ నేతల జనసేనకి గుడ్ బాయ్ చెప్పారు. అందులో ప్రముఖంగా విజయవాడ పశ్చిమ ఇన్ ఛార్జ్ పోతిన మహేష్, కైకలూరు జనసేన ఇన్ ఛార్జ్ బీవీ రావు జనసేన పార్టీకి రాజీనామా చేశారు. నగరాలు, యాదవ సామాజికవర్గాల నేతలు కావడంతో ఇరువురికి సీటివ్వలేదు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. సుజనా చౌదరి కోసం నగరాల నేత పోతిన మహేష్ కి సీట్ ఎగగొట్టాడు పవన్, గతంలో తన తల్లిని దూషించారు అని సుజనా చౌదరి పై పరువు నష్ట దావా వేసిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అవి అన్నీ పట్టించుకోకుండా డబ్బే కొలమనంతో జనసేన బలంగా ఉన్న సీట్ కూడా వదులుకున్నాడు. కామినేని శ్రీనివాస్ చౌదరి కోసం యాదవ నేత అయిన బీవీరావుకి సీట్ నిరాకరించాడు.
మరోవైపు గోదావరి జిల్లాల్లోనూ వరుసగా బీసీ నేతలు రాజీనామా చేస్తున్నారు. ఇప్పటికే శెట్టిబలిజ నేతలు పితాని బాలక్రిష్ణ, మాజీ మేయర్ సరోజలు రాజీనామాలు చేశారు.ఉభయగోదావరి జిల్లాల్లో ఒక్క శెట్టిబలిజ, గౌడ వర్గ నేతలకు సీటివ్వని జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తమకు తమ కులాలకు గౌరవం, ప్రాతినిధ్యం లేని చోట ఉండలేము అంటూ పార్టీని వీడుతున్నారు పలువురు జనసేన నాయకులు.