‘స్థానిక ఎమ్మెల్యే వర్మగారట. ఆయన ఎమ్మెల్యే అయ్యుండి పేకాట క్లబ్ నడుపుతున్నాడు. ఇది దారుణం’ గత ఎన్నికల ప్రచారంలో పిఠాపురంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్అన్న మాటలివి. ఇప్పుడు అదే వర్మ లేకుండా సేనాని ఒక్క అడుగు కూడా ముందుకు వేయడం లేదు. ఐదు సంవత్సరాల్లో ఎంత మార్పు వచ్చిందో కదా..
పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ పూర్తిగా తెలుగుదేశం ఇన్చార్జి వర్మకు దాసోహమైపోయాడు. అతని సహకారం లేకపోతే గెలవలేననే భయం పట్టుకుంది. తన అన్న నాగబాబుకు కొన్ని బాధ్యతలు ఇచ్చినా వర్మపై ఎక్కువ భారం పెట్టాడు. కానీ ఇదే వర్మను నాడు పేకాట క్లబ్ నిర్వాహకుడని తిట్టాడు. అంతలోనే ఆయన మంచి వాడైపోయాడా అనే ప్రశ్నలను జనసైనికులు వేస్తున్నారు.
భార్య అన్నా లెజినోవాతో పవన్ పిఠాపురంలో గృహ ప్రవేశం చేయాలని సేన మాజీ నాయకుడు పోతిన మహేష్ కోరాడు. కానీ అలా జరగలేదు. దీంతో సేనాని వైవాహిక జీవితంపై అభిమానుల్లోనే రూమర్స్ మొదలయ్యాయి. సాధారణంగా నామినేషన్ సమయంలో అభ్యర్థులు తమ కుటుంబసభ్యులను పక్కన పెట్టుకుంటారు. భార్య, పిల్లలు వెంట ఉండేలా చూసుకుంటారు. పత్రాలు ఇచ్చేందుకు వారిని తీసుకెళ్తారు. కానీ సేనాని విషయంలో అదేమీ జరగలేదు. ఆయన మూడో భార్య, పిల్లలు రాలేదు. అసలు వారి ఊసే చాలాకాలంగా లేదని కూటమి నేతలు గుసగుసలాడుకుంటున్నారు. దీనిని బట్టి పవన్ జీవితంలో చాలా కోణాలున్నాయని, ప్రత్యర్థులు చెబుతున్నవన్నీ నిజాలేనని అర్థమైపోతోంది. మెగా ఫ్యామిలీ నుంచి కేవలం నాగబాబు మాత్రం నామినేషన్ కార్యక్రమానికి వచ్చాడు. పేకాట క్లబ్ నిర్వాహకుడిగా ఒకప్పుడు తాను తిట్టిన వర్మ ఆశీస్సులను పవన్ తీసుకోవడంతో జనసైనికులు అల్లాడిపోతున్నారు. ఆర్వోకు పత్రాలు ఇచ్చేందుకు ఆయన్నే తీసుకెళ్లాడు. అవసరం తనది కాబట్టి ఎలాంటి వ్యక్తి అయినా ఫర్వాలేదనే ధోరణలో పవన్ ఉన్నాడనే విమర్శలున్నాయి. అవినీతిపరుడైన చంద్రబాబుతోనే స్నేహం చేస్తున్న నేపథ్యంలో వర్మ ఒక లెక్కా అనే వారు లేకపోలేదు.