సినిమాల్లో హీరోలుగా చలామణి అయ్యే వాళ్లు నిజ జీవితంలో హీరోయిక్ గా ఉండలేరు అనడానికి పవన్ కళ్యాణ్ జీవితమే ఒక ఉదాహరణ అని అంటున్నారు ప్రజలు.. సినిమాల్లో 100 మందిని ఒంటి చేత్తో మట్టి కరిపించే హీరోలు నిజ జీవితంలో కూలబడిపోతారు. సినిమాల్లో గంటల గంటలు రాళ్లు కొడుతూ రప్పలు కొడుతూ కొండలు గుట్టలు ఎక్కుతూ దిగుతూ శ్రమకు అద్దం పట్టేలాగా పాత్రలు ధరించి జనాన్ని ఇదంతా నిజమేనేమో అని మైమరిపించే హీరోలు నిజ జీవితంలో మాత్రం కాస్త కష్టాన్ని కూడా ఓర్చుకోలేరు.
ఉదాహరణకు పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఆయన సినిమాల్లో హీరోయిజాన్ని వేరే లెవల్ చూపిస్తారు దర్శకులు… కానీ నిజ జీవితంలో మాత్రం ఆయన ఒక జీరో లాగే మిగిలిపోయాడు. ఆంధ్రప్రదేశ్లో జరగనున్న 2024 సార్వత్రిక ఎన్నికలలో భాగంగా పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే కాకినాడ జిల్లా పార్లమెంటు స్థానానికి కూటమి నుండి జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తంగెళ్ల ఉదయ్ నామినేషన్ కార్యక్రమానికి వచ్చిన పవన్ కళ్యాణ్ నాలుగు అడుగులు వేసిందే మొదలు నిలువునా కూలిపోయాడు. ఒంట్లో సత్తువు లేకుండా కనీసం నాలుగు అడుగులు కూడా వేయలేని స్థితిలో నిట్ట నిలువునా కూలబడిపోయాడు.
గతంలో మెట్ల మార్గం ద్వారా తిరుపతి దర్శనానికి వెళ్లే క్రమంలో మెట్లు ఎక్కుతూ వేసిన నాలుగు అడుగుల కే సొమ్మసిల్లి పడిపోయాడు. ఆ తర్వాతకాలంలో విశాఖపట్నంలో చేసిన జనసేన పార్టీ కవాతులో భాగంగా రెండు కిలోమీటర్లు కూడా నడవలేకపోయి హాస్పటల్ పాలయ్యాడు. ఇలా చెప్పుకుంటూ పోతే పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా ప్రజలు మధ్యకు వచ్చి నాలుగు అడుగులు కూడా వేయకుండానే వెనక్కి వెళ్ళిపోయిన సందర్భాలు మంచానికి పరిమితమైనటువంటి పరిస్థితులు కోకొల్లలు.. ఇవన్నీ చూసిన జనం హీరోయిజం కేవలం సినిమాలకు మాత్రమే పరిమితమా వ్యక్తిగతంగా ఒంట్లో సత్తువ లేదా అంటూ బహిరంగంగానే పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పిస్తున్నారు.. జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు సైతం మన నాయకుడు జనసత్వాలు ఇంతేనా అంటూ పెదవి విరుస్తున్నారు.