పవన్ కళ్యాణ్ తడిగుడ్డతో గొంతు ఎలా కోస్తారో తనకి బాగా తెలిసివచ్చింది అని తెలిపారు జనసేన మాజీ నేత పోతిన మహేష్ . 2014 నుంచి పార్టీలో కొనసాగితే 2019లో సీట్ కేటాయించారు, ఆ ఎన్నికల్లో ఓటమి పాలు అయినా నేను ఏ పార్టీలోకి వెళ్లలేదని, ఆ ఎన్నికల్లో ఓటమిపాలు చెందిన తర్వాత చాలామంది నాయకులు జనసేనని వీడి ఇతర పార్టీల్లోకి వెళ్లిపోయారు, నేను పవన్ కళ్యాణ్ ని నమ్ముకొని విజయవాడలో పార్టీని బలోపేతం చేస్తే టికెట్ నాకు కాకుండా కూటమిలో భాగంగా సీటు ఎవరికో కేటాయించారు.
బీసీలలో నగరాల సామాజిక వర్గానికి చెందిన తనకు కూటమిలో సీట్ వస్తుందని అందరూ భావించారు, కానీ పవన్ కళ్యాణ్ బ్యాక్వర్డ్ క్లాస్ కన్న బ్యాంక్ బ్యాలెన్స్ ఇచ్చే సుజనా చౌదరికి సీట్ కేటాయించాడన్నారు . తనకు జరిగిన మోసంతో పార్టీలో ఉండలేక బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు బ్యాక్ బోన్ క్లాస్ అనే నమ్మే సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరానని తెలిపారు. ఆ పార్టీలో చేరిన రెండు రోజులకే విజయవాడలో బస్సు యాత్ర నిర్వహిస్తే తనను గౌరవించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనను బస్సులోని పిలిచి , అభ్యర్థులతో పాటు బస్సు పైకి ఎక్కించి తనని గౌరవించారని తెలిపారు. గతంలో పవన్ కళ్యాణ్ తో కలిసి మాట్లాడాలని ప్రయత్నించిన తమకు అపాయింట్మెంట్ లభించేది కాదన్నారు .
బిజెపి తరఫున సుజన చౌదరీ టికెట్ కేటాయించిన తర్వాత తన ఇంటికి టిడిపి జనసేన బ్రోకర్లు వచ్చిన తాను తిరస్కరించానని, నాన్ లోకల్ అయినా సుజనా చౌదరికి తాను సపోర్ట్ చేయలేను అని భావించి ఆ పార్టీని వదిలి వచ్చేసాను అని వెల్లడించారు. జగన్ మోహన్ రెడ్డి నగరాలు సామాజిక వర్గానికి మేయర్, దుర్గగుడి చైర్మన్, శ్రీశైలంలో 50 సెంట్లు భూమి, ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేశారని అన్నారు. అనేక పదవులు గౌరవం గుర్తింపు ఇచ్చిన సీఎం జగన్ వైపు ఉండాల రాత్రికి రాత్రి సుజనా చౌదరి దింపిన కూటమి వైపు ఉండాలా అని తనని తాను ప్రశ్నించుకుంటే జగన్ వైపు నిలబడాలని వైఎస్ఆర్సిపి లో చేరానని చెప్పారు. రానున్న ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ లో వైఎస్ఆర్సిపి జెండాను కచ్చితంగా ఎగరవేస్తామని, ఆసిఫ్ ను గెలిపించుకొని వచ్చి తన సత్తా ఏంటో చూపిస్తాను అని ఈ సందర్భంగా తెలిపారు.