ఎన్నికలు వస్తే చాలు.. అభ్యర్థుల తరఫున కుటుంబసభ్యులు, బంధువులు ప్రచారం చేస్తుంటారు. తమవారిని గెలిపించాలని ప్రతి ఇంటికీ వెళ్లి ఓటర్లను అభ్యరిస్తుంటారు. ప్రతి పార్టీలోనే ఇలాగే జరుగుతుంది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విషయానికొచ్చే సరికి ఆయన వ్యవహారశైలి నచ్చక భార్య, మెగా ఫ్యామిలీ దూరం పెట్టినట్లు జనసైనికులు, తెలుగు తమ్ముళ్లు గుసగుసలాడుకుంటున్నారు.
పవన్ తనను నీతిమంతుడిగా, మంచి గుణాలున్న వ్యక్తిగా చూపించుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. కానీ నిజస్వరూపం వేరే ఉందని సినీ సర్కిల్లో టాక్ ఉంది. అందుకే ఆయన పిఠాపురంలో పోటీ చేస్తున్నా మెగా ఫ్యామిలీ దూరంగా ఉందని అంటున్నారు. రాజకీయ లబ్ధి కోసం సేనాని అనేక సందర్భాల్లో కుటుంబం గురించి తక్కువ చేసి మాట్లాడాడు. ఆ మధ్య ఒకసారి తన తండ్రి వెంకట్రావును ఇలా అన్నాడు. మా నాయనమ్మ దీపారాధన చేస్తే అందులో మా నాన్న సిగరెట్ వెలిగించి దేవుడు లేడని చెప్పాడు. ఈ విషయం అప్పట్లో దుమారం రేపింది. పవన్ వ్యాఖ్యలపై తల్లి అంజనమ్మ, పెద్దన్న చిరంజీవి ఆగ్రహం వ్యక్తం చేశారట.
అల్లు అరవింద్ అంటే పవన్‌కు చాలా కోపం ఉందనేది సినీ పరిశ్రమలో జగమెరిగిన సత్యం. ప్రజారాజ్యం పార్టీ విషయంలో వారి మధ్య విభేదాలు వచ్చినట్లు చెబుతారు. పవన్ అభిమానులు ప్రతి మెగా ఫ్యామిలీ ఫంక్షన్లలో తమ హీరో పేరు చెప్పాలని రచ్చరచ్చ చేస్తుంటారు. అలాగే అర్జున్‌కు సంబంధించిన కార్యక్రమంలో ఆయన్ను చెప్పాలని అడగ్గా చెప్పను బ్రదర్ అన్నాడు. దీనిని సేనాని మనసులో పెట్టుకున్నాడని చెబుతారు. అందుకే అల్లు అర్జున్ ఎదుగుదల అతడికి ఇష్టం లేదట. సేనాని తన అభిమానులను అర్జున్పైకి ఉసిగొల్పి సోషల్ మీడియాలో అబద్ధాలు ప్రచారం చేయిస్తుంటాడు. బూతులు తిట్టిస్తుంటాడు. ఇప్పటికీ వారి ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో మాటల యుద్ధం జరుగుతూ ఉంటుంది.
పీఆర్పీ సమయంలో మెగా ఫ్యామిలీ అంతా ఎన్నికల ప్రచారం చేసింది. ముఖ్యంగా రామ్‌చరణ్, అల్లు అర్జున్ బాగా తిరిగారు. వారంతా ఇప్పుడు సైలెంట్ అయ్యారు. 2019లో నాగబాబు ఎంపీగా పోటీ చేయగా కుటుంబసభ్యులు ప్రచారం చేశారు. ప్రస్తుతం వారు రావడం లేదు. ఇంకా మెగా కాంపౌండ్‌లో చాలామంది హీరోలున్నారు. అయితే ఎవరూ పవన్ తరఫున ప్రత్యక్షంగా తిరిగేందుకు ఇష్టపడడం లేదు.
పవన్ పిఠాపురంలో గృహ ప్రవేశానికి భార్య అన్నా లెజినోవాతో వెళ్లాలని ఇటీవల పోతిన మహేష్ అన్నారు. అయితే అలా జరగలేదు. దీంతో సేనాని వివాహ జీవితంపై మరోసారి వార్తలు గుప్పుమన్నాయి. చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థుల తరఫున వారి భార్యలు ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేస్తున్నారు. కానీ పిఠాపురంలో అన్నా లెజినోవా తిరగకపోతుండడంతో జనసైనికులే మా అధినేత ఇలా తయారయ్యాడేంటని బాధపడుతున్నారు. తండ్రిపైన చేసిన వ్యాఖ్యలు, అల్లు కుటుంబంతో ఉన్న విభేదాలు, చంద్రబాబుతో తిరగడం తదితర కారణాలతో మెగా ఫ్యామిలీలో మెజార్టీ సభ్యులు పవన్ ప్రచారానికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నారని తెలిసింది.
ఇక చేసేదేమీ లేక పవన్ ఇటీవల చిరంజీవిని కలిసి కాళ్లు పట్టుకుని ఏడ్చాడని, దీంతో పరోక్షంగా అండగా ఉండేందుకు ఒప్పుకొన్నాడని సమాచారం. ఈ నేపథ్యంలో చిరు కూటమి పవర్లోకి వస్తే మనకి ప్రయోజనాలుంటాయని చెప్పడంతోనే మెగా ఫ్యామిలీ హీరోలు భారీ మొత్తంలో సేనానికి డబ్బు ఇచ్చారని టాక్ ఉంది. కానీ ప్రచారానికి మాత్రం రాలేమని తేల్చి చెప్పారట. పిఠాపురం నియోజకవర్గంలో జనంలోకి వెళ్లినప్పుడు మీ భార్య, కుటుంబం ఎక్కడని అడిగితే తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియక ఇబ్బంది పడాల్సి వస్తుందని అన్న నాగబాబును తిప్పుతున్నాడట పవన్.
– వీకే..