Pawan Kalyan : జనసేన విషయంలో ఏది నిజమో , ఏది ఫేకో ఎవరికీ అర్ధమవట్లేదు . చివరికి జనసేనాని ఇచ్చిన హామీ కూడా ఫేక్ అని జనసేన శాతాగ్ని విభాగం సోషల్ మీడియాలో ప్రచురించడం చూస్తే అసలు(Pawan Kalyan)పార్టీ ఒరిజినల్ నా , ఫేకా అనే అనుమానం సామాన్యులకు కలుగుతుంది .
2019 డిసెంబర్ 2 న కడపలో పర్యటించిన పవన్ కళ్యాణ్ పిరికివాళ్లయిన రాయలసీమ ప్రజలకు ధైర్యం కోసం రైల్వే కోడూరులో అతి పెద్ద గ్రంధాలయం నిర్మిస్తానని హామీ ఇచ్చాడు. ఆ తర్వాత మూడేళ్లకు సెప్టెంబర్ 16 న కడపలో పర్యటిస్తున్న పవన్ 17 వ తారీఖు రైల్వేకోడూరులో గ్రంధాలయానికి భూమి పూజ చేస్తున్నారని జనసేన పేరిట ఉన్న లెటర్ పాడ్ తో సోషల్ మీడియాలో హల్చల్ చేశారు జనసైనికులు.
అయితే 16వ తారీఖు సాయంత్రమే జనసేన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ రిలీజ్ చేసింది . గ్రంధాలాయానికి భూమి పూజ అంటూ వచ్చిన లెటర్ ఫేక్ అని జనసేన గ్రంధాలయం కట్టట్లేదని జనసేన శతాగ్ని అనే పేజీలో పోస్ట్ చేసారు .
మాట ఇచ్చిన మూడేళ్ళకైనా నిలబెట్టుకుంటున్నాడు అని అభిమానులు సంతోషపడినంత సేపు కూడా ఆ వార్త నిలబడక ఫేక్ అని తేల్చి పారేసేసరికి సేనాని అభిమానులు ఉసూరుమనటం జరిగింది , పవన్ కళ్యాణ్ మాటల్లో అవిశ్వసనీయత , హామీల్లో మోసం మరోసారి బయల్పడింది ఈ ఘటనతో . ఆ తర్వాత మళ్ళీ నేటి వరకూ గ్రంధాలయ నిర్మాణ ఊసు లేదు
అసలు జనసేనాని మాట మీద నిలబడడా , కామన్ మెన్ ఫ్రొటాక్షన్ ఫోర్స్ నుండి భీమవరం అల్లూరి విగ్రహం దాకా ఇచ్చిన మాట తప్పుతూ వచ్చిన జనసేనాని ఈ సారి విచిత్రంగా తాను హామీ ఇచ్చిన రైల్వే కోడూరు గ్రంధాలయం నిర్మాణ విషయం ఫేక్ అని తన పార్టీ విభాగం నుండే చెప్పడం తన విశ్వసనీయత అనే కొమ్మని అసత్యపు హామీలు అనే గొడ్డలితో నరుక్కున్నట్టు అనిపించక మానదు .
పోనీ ఆ లెటర్ ఫేక్ అయ్యుండి , ఆయన మాటిచ్చినట్టు గ్రంధాలయం నిర్మించే ఉద్దేశ్యం ఆయనకి ఉండి ఉంటే , అయ్యా ఈ లెటర్ లో చెప్పినట్టు గ్రంధాలయం భూమిపూజ ఇప్పుడు కాదు . ఫలానా సంవత్సరం కడతాను అని ఓ దశాబ్దం వాయిదా వేసి ఉన్నా కట్టినా మానినా జనం మర్చిపోవటానికి తగిన వ్యవధి ఇచ్చినట్టు ఉండేది .
ఏంటో ఈ పిచ్చి పనులు పాపం అయోమయ సేనాని ,
గమ్యగోచరం కాని సేన …