పిఠాపురం ప్రజల కోసం ఏమైనా చేస్తా.. నన్ను గెలిపించండి.. ఇక్కడే ఉంటా.. మీ సేవలో తరిస్తానని చెప్పిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రచారాన్ని అర్ధాంతరంగా ముగించుకుని ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. గత 30న ప్రారంభమైన పర్యటన ఈనెల 2వ తేదీ వరకు జరగాలి. కానీ ఆపేయడం.. తెలంగాణ రాజధానికి పోయి మళ్లీ సోమవారమే పిఠాపురం వచ్చారు. రావడం వెనుక పెద్ద ఈ మధ్యలో చాలా వ్యవహారాలు చక్కబెట్టి ఉంటారని అటు జనసైనికులు.. ఇటు తెలుగు తమ్ముళ్లలో ప్రచారం జరుగుతోంది. పైకి అనారోగ్యాన్ని సాకుగా చూపిస్తున్నా.. డబ్బు సర్దుకోవడం కోసమే సేనాని వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది.
గతాన్ని చూస్తే ఓసారి పవన్ కార్యకర్తల సమావేశంలో ‘జగన్ నువ్వేంత.. నీ బతుకెంత.. నీ స్థాయెంత అన్నారు’ 2019లో వందకు పైగా స్థానాల్లో సేన అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. పవన్ రెండుచోట్ల ఓడిపోయారు. జగన్ 151 మందిని ఎమ్మెల్యేలుగా, 22 మంది ఎంపీలుగా గెలిపించారు. 2024లో కూడా ఒంటరిగానే బరిలో దిగారు. పవన్ దిగజారిపోయి బాబు ఇచ్చిన 21 అసెంబ్లీ, రెండు ఎంపీ సీట్లు తీసుకున్నారు. తాను పిఠాపురం నుంచి బరిలో దిగారు. ఓ వైపు జగన్ ఎన్నికల ప్రచారాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులను పరిచయం చేసి గెలిపించాలని కోరుతున్నారు. ఇదే సమయంలో పవన్ పిఠాపురంలో టీడీపీ ఇన్చార్జి వర్మ చేతులు పట్టుకుని ఒకటే కోరుతున్నా.. నా గెలుపు మీ చేతిలో పెట్టానని అన్నారు. దీనిని బట్టి ఎవరి స్థాయి ఏంటో అర్థం చేసుకోవచ్చు.
పిఠాపురంలో వంగా గీత చేతిలో నన్ను ఓడించడానికి జగన్ వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని పవన్ ఆరోపిస్తున్నారు. కానీ అందులో నిజం లేదు. సేనానికి ఓటమి భయం పట్టుకుని కోట్ల రూపాయల డబ్బు ఏర్పాటు చేసుకునే పనిలో పడ్డారని తెలిసింది. ఇప్పటికే తన చేతిలో ఐదారు సినిమాలున్నాయి. ఆయా నిర్మాతల నుంచి కొంత నగదు వసూలు చేసుకుని పిఠాపురంలో ఖర్చు చేసేందుకు యత్నిస్తున్నారు. జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటూ గతంలో ఊదరగొట్టిన పవన్ ఇటీవల ఓ సందర్భంలో డబ్బు ఖర్చు పెట్టాల్సిందేనన్నారు. చంద్రబాబు కూడా అదే సలహా ఇచ్చారు. దీంతో తన గెలుపు కోసం ఓటర్లను ప్రలోభపెట్టే పనిలో పడ్డారు.
ఓ వైపు చంద్రబాబు నాయుడు కూడా పవన్‌కు భారీగా డబ్బు సమకూర్చారు. నిర్మాతల నుంచి తీసుకుంది, పార్టీ పేరుతో అందుకున్న విరాళాలు, వివిధ రూపాల్లో వచ్చిన సొమ్మును పంపిణీ చేసేందుకు సిటీల్లో ఉంటున్న తన సీనియర్ అభిమానులు కొందరిని పిలిపిస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి వర్మ వర్గం పవన్ పోటీని తీవ్రంగా వ్యతిరేకించింది. అయితే చంద్రబాబు వర్మకు సర్ది చెప్పారు. పదవి, డబ్బు ఆశ పెట్టారు. ఆ నియోజకవర్గంలో టీడీపీ చోటా నేతలు, కార్యకర్తలు సేన కోసం పనిచేయాలంటే ఎంతో కొంత ముట్టజెప్పాల్సిందేనని సేనానికి అర్థమైంది. దీంతో పిఠాపురంలో ఎన్నికల ప్రచారం ఆపేసి వెళ్లి నగదు వ్యవహారం చక్కబెట్టినట్లు తెలిసింది. ఈ విషయాన్ని కవర్ చేయడానికి ఎల్లో గ్యాంగ్ పవన్ అనారోగ్యంతో బాధపడుతున్నారని రాసుకొచ్చింది. కానీ సోమవారం పిఠాపురంలో తేలిన సేనాని పలువురిని సేనలో చేర్చుకునే కార్యక్రమం నిర్వహించారు. కూటమి నేతలతో సమావేశం నిర్వహించారు. 3వ తేదీన తెనాలి నియోజకవర్గంలో వారాహి విజయభేరి బహిరంగ సభలో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. మేము ఏం చెప్పినా జనం నమ్మేస్తారని ఎల్లో, సేన గ్యాంగ్ భావన. కానీ ఆ రోజులు ఎప్పుడో పోయాయి.