అసలు ఎవరు ఈ తమన్నా సింహాద్రి? ఎందుకు పవన్ కళ్యాణ్ తో పోల్చాల్సి వస్తుంది? అసలు పవన్ కళ్యాణ్ కి తమన్నా సింహాద్రికి సంబంధం ఏంటి? జనసేన పార్టీతో ఈమెకి ఉన్నటువంటి అనుబంధం ఏమిటి? ఆమె పౌరుషంతో పంతంతో పవన్ కళ్యాణ్ కి సంబంధం ఏంటి? ఇలా ఆలోచించుకుంటూ పోతే అనేక ప్రశ్నలు తమన్న సింహాద్రి పైన పవన్ కళ్యాణ్ పైన వస్తూనే ఉంటాయి. నిజానికి తమన్నా సింహాద్రి ఒక ట్రాన్స్ జెండర్ వుమెన్.. గత సీజన్లో బిగ్ బాస్ లో పార్టిసిపెంట్ గా చేసి టెలివిజన్ ద్వారా ఫేమస్ అయిన వ్యక్తి. అప్పటివరకు ఎవరికీ తెలియని ఈ ట్రాన్స్ జెండర్ వుమన్ తొలిసారిగా బిగ్ బాస్ ప్రోగ్రాం ద్వారానే రాష్ట్ర ప్రజలకు పరిచయం అయింది.
ఇక విషయానికొస్తే బిగ్ బాస్ ప్రోగ్రాం ముగిసిన అనంతరం సినిమా హీరోగా పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని అయిన తమన్నా సింహాద్రి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ సిద్ధాంతాలు వచ్చి జనసేన పార్టీలో చేరుతున్నట్లు మీడియా ముఖంగా వెల్లడించి జనసేన పార్టీ కండువా కప్పుకుంది. జెండా కప్పుకోవడమే కాకుండా జనసేన పార్టీ తరపున అనేక ప్రచార కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని తన గొంతు వినిపించింది. ఆ క్రమంలోనే పవన్ కళ్యాణ్ నుండి రేపు జరగబోయే 2024 సార్వత్రిక ఎన్నికలలో జనసేన పార్టీ టికెట్ మీద పోటీ చేయడానికి బలమైన హామీ వచ్చిందని చెప్పుకుంది.
అయితే కూటమి పొత్తు కారణంగా పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుండా తమన్న సింహాద్రికి టికెట్ ఇవ్వడానికి నిరాకరించాడు. దీంతో ఇంతకాలం పార్టీ కోసం కష్టపడి పనిచేసిన తమన్నా సింహాద్రికి జనసేన పార్టీ చేసిన అన్యాయం పవన్ కళ్యాణ్ చేసిన అవమానానికి మనస్థాపం చెంది, కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో నీ మీదే పోటీ చేస్తాను అని పవన్ కళ్యాణ్ తో సవాల్ చేసినట్లు సమాచారం. అందులో భాగంగానే పిఠాపురంలో కూటమి జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ పై గతంలో జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన బోడె రామచంద్ర యాదవ్ స్థాపించిన భారత చైతన్య యువజన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ పై పోటీకి దిగింది.
గతంలో నేను మీకోసం ప్రచారం చేసి తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే మీరు నా తల్లిని దూషించారు. లోకేష్ గారిని వదిలిపెట్టను, తెలుగుదేశం పార్టీ పతనమే నా లక్ష్యం అని మంగమ్మ శపథం చేసిన పవన్ కళ్యాణ్ నేడు అదే తెలుగుదేశం పార్టీ కోసం ఏమాత్రం పౌరుషం లేకుండా కూటమితో కలిసి పనిచేయటం సర్వత్ర చర్చనీయాంసమైంది. కానీ, ఇచ్చిన మాట నమ్మి జనసేన పార్టీలో కష్టపడి పనిచేసిన తమన్న సింహాద్రి కి టికెట్ నిరాకరించడంతో పవన్ కళ్యాణ్ పై చేసిన శపదానికి కట్టుబడి, గెలుపోటములతో సంబంధం లేకుండా పౌరుషానికి నిలబడి అతనిపైనే పోటీకి దిగిన తమన్నా సింహాద్రిపై విమర్శకుల నుండి ప్రశంసలు వినిపిస్తున్నాయి. అయితే తమన్నా సింహాద్రి మాజీ ఎమ్మెల్యేగా, మంత్రిగా విశేష సేవలందించి, మంచి పేరు, గౌరవ ప్రతిష్టలు కలిగిన సింహాద్రి సత్యనారాయణ గారికి స్వయానా తమ్ముడు కొడుకు కావడం గమనార్హం. అయితే అతని వ్యక్తిగత కారణాలతో ట్రాన్స్ జెండర్ వుమన్ తమన్నా సింహాద్రిగా మారడం మనకు తెలిసిందే.