పవన్ కళ్యాణ్ తన వ్యక్తిగత ద్వేషంతో, తన సామాజిక వర్గం తన కిందనే ఉండాలనే స్వార్థంతో పాటు తన సామాజిక వర్గంలో ప్రత్యర్థి పార్టీలలో ఎవరైనా ఉన్నతి స్థాయికి ఎదిగిన తట్టుకోలేక వారి పరువును అలాగే రాజకీయాల్లోకి కుటుంబ సభ్యులను తీసుకువచ్చి తిరిగి తనకు ఇలాంటివి ఇష్టం ఉండవని ఒక ముసుగులో తన అభిమానులను , కార్యకర్తలను మోసం చేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే తన సామాజిక వర్గంలో ముద్రగడ పద్మనాభంకు ప్రత్యేక అభిమానులున్నారు. కాగా పవన్ కళ్యాణ్ ముద్రగడ వలన కూటమికి నష్టం కలిగుతుంది అని భావించి మొదట ముద్రగడను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి, తన అభిమానుల చేత కార్యకర్తల చేత నీచ స్ధాయిలో అతని కుటుంబాన్ని సోషల్ మీడియా వేదికగా వేధించారు. అయిన ముద్రగడ పద్మనాభం వెనక్కి తగ్గక పోవడంతో తన అహం దెబ్బతిని చివరకు ముద్రగడ కూతురుని బయటకు తెచ్చి ఆమె చేతనే తండ్రిని తిట్టించిన ఘనుడు పవన్ కళ్యాణ్. అలా తిట్టినందుకు ఆమెకు తన పార్టీ పోటి చేసే అవకాశం కల్పిస్తా అంటూ వికృత పోకడలను బయట పెట్టుకున్నారు. పైకి మంచితనం అనే ముసుగులో తిట్టించి, తిరిగి వాళ్ళను కలుపుతా అంటూ మాట్లాడటం కొసమెరుపు.
కాపులో మరో కీలక నాయకుడు పవన్ కళ్యాణ్ కు పంటి కింద రాయి లాగా తను చేసే ప్రతి తప్పుడు ఆరోపణలను, తప్పుడు నిర్ణయాలను ఎత్తిచూపి ప్రజలకు సాక్ష్యాలతో వివరించే అంబటి రాంబాబు అంటే పవన్ కళ్యాణ్ కు విపరీతమైన ద్వేషం. అంబటి రాంబాబు మీద ఎన్నో అవాకులు చెవాకులు పేలారు. అయినా తన కోపం చల్లారక తన సినిమాలో రాంబాబు వ్యక్తిత్వాన్ని తగ్గించడానికి ఒక కామెడీ రోల్ పెట్టాడు. అంతే కాకుండా రాంబాబు మీద ఎప్పుడు తన అభిమానుల చేత కార్యకర్తల చేత తిట్టించని తిట్లు లేవు. అయిన అంబటి రాంబాబు తగ్గక పోయేసరికి ఎన్నికల్లో రాంబాబును మానసికంగా దెబ్బ కొట్టడానికి రాంబాబు కూతురు అల్లుడు మధ్య గొడవలు జరిగి విడాకులు కోరుతూ కోర్టు కు వెళ్లిన విషయం తెలిసి, రాంబాబు అల్లుడి చేత వ్యతిరేకంగా వీడియోలు వదిలారు. వాటిని పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియాలో విసృతంగా ప్రచారం చేస్తూ మానసిక ఆనందం పొందుతున్నారు. ఇలా అంబటి రాంబాబు కూతురి జీవితాన్ని పబ్లిక్ లో తీసుకువచ్చి పవన్ కళ్యాణ్ ఏమి సాధిస్తారో తెలియదు.
మరో కాపు కీలక నాయకుడు కన్నబాబు మీద పవన్ కళ్యాణ్ కు నిలువెల్ల చులకన భావం. తనతో పాటు ఉండే వ్యక్తి రెండు సార్లు ఎమ్మేల్యే గా గెలిచి మంత్రి కూడా అయ్యాడు. రాజకీయాల్లో ఉన్నతి స్థాయికి ఎదిగాడని తట్టుకోలేక పోతున్న విషయాన్ని ఈ మధ్యనే కాకినాడ పర్యటనలో బయట పెట్టి నాలుక కరుచుకున్నాడు పవన్ కళ్యాణ్. ఇలా మానసిక వ్యథతో ప్రతీ సందర్భంలో కన్నబాబు మీద తన విద్వేషాన్ని బయట పెట్టుకున్నాడు. కన్నబాబును ఓడిస్తా అంటూ 2019, 2024 లో కూడా శపథం చేశారు.
ఇక పేర్ని నాని మీద మంత్రిగా ఉన్నాడని తనను మీడియాలో సాక్ష్యాలతో అటాడుకుంటున్నాడని పేర్ని నాని జగన్ కు బానిస అంటూ చులకన చేసి మాట్లాడాడు.
ఇలా కాపులు వేరే పార్టీలో మంచి ఉన్నత స్థాయికి ఎదిగితే పవన్ కళ్యాణ్ తట్టుకోలేడు. ఆ నాయకులు తిరిగి పవన్ కళ్యాణ్ ను, కాపు కులాన్ని తీసుకువెళ్ళి చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర పెట్టావని విమర్శిస్తే పవన్ కళ్యాణ్ ఎక్కడ తల పెట్టుకుంటారని మిగతా కాపు సామజిక వర్గానికి చెందిన కీలక నాయకులు బహిరంగంగా చర్చించుకుంటున్నారు.