‘పిఠాపురంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ను ఓడించడానికి వైఎస్సార్ కాంగ్రెస్ కుట్రలు చేస్తోంది. మిథున్‌రెడ్డి, దాడిశెట్టి రాజా, ఇంకా పలువురికి చెందిన మనుషులు ఇక్కడున్నారు. కడప నుంచి రౌడీలను పంపారు. వారిని ఎలా ఎదుర్కోవాలో మాకు బాగా తెలుసు’ పవన్ అన్న, సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు మంగళవారం మాటలివి.
వైఎస్సార్సీపీ నిలబెట్టి మహిళ వంగా గీతను ఎదుర్కోలేక సేనాని మెలో డ్రామాను బాగా రక్తి కట్టిస్తున్నాడు. చాలారోజులుగా మిథున్‌రెడ్డి మీద పడి ఏడుస్తున్నాడు. పవన్ ఎలా పార్టీ అధ్యక్షుడి హోదాలో ఊరూరు ఎలా తిరుగుతున్నాడో.. మిథున్ వైఎస్సార్సీపీ రీజినల్ కో–ఆర్డినేటర్ హోదాలో గోదావరి జిల్లాల్లో పర్యటిస్తున్నాడు. ఇందులో తప్పేమీ లేదు. కానీ సేనాని మాత్రం తనను ఓడించడానికి రాయలసీమ నుంచి వచ్చారు.. వచ్చారంటూ గోల పెడుతున్నాడు. ఇప్పుడు నాగబాబు కొత్త పాట అందుకున్నాడు. ఏమీ జరగకపోయినా జరిగినట్లు చూపించేందుకు యత్నిస్తున్నాడు. రాయలసీమ అంటే ఫ్యాక్షనిజం, రౌడీలుగా చిత్రీకరించడం సినీ పరిశ్రమలోని ఓ వర్గానికి దశాబ్దాలుగా అలవాటైపోయింది. దానినే నేడూ ప్రయోగిస్తున్నారు.
అసలు నాగబాబు పిఠాపురం వాసి కాదు. హైదరాబాద్ నుంచి వచ్చి అక్కడ స్థానికులపై పెత్తనం చెలాయిస్తున్నాడు. పవన్ కోసం అక్కడి నుంచి చాలా గ్యాంగ్‌లను దింపాడు. తెలుగు రాష్ట్రాల్లో సైకోలుగా పేరొందిన సేనాని అభిమానులు కొందర్ని పిలిపించుకున్నాడు. ఇక బూతు షో జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన హైపర్ ఆది, గెటప్ శ్రీను తదితరులను పిఠాపురంలో ప్రతి వీధికి తిప్పి వంగా గీతపై తప్పుడు ప్రచారాలు చేయిస్తున్నాడు. అంతటితో ఆగకుండా గబ్బర్ సింగ్ అనే సినిమాలో ఆర్టిస్టులుగా చేసిన వారిని పిలిపించి రోడ్ల మీదకు వదిలాడు.
ప్రతి పార్టీలో స్టార్ క్యాంపెయినర్లు ఉంటారు. వారు ఎక్కడైనా ప్రచారం చేయొచ్చు. వారికి ప్రాంతాన్ని ఆపాదించి హేళనగా మాట్లాడడం పవన్ గ్యాంగ్‌కే చెల్లింది. తమ్ముడు గెలుస్తాడని నమ్మకం లేకే నాగబాబు తన కుటుంబం చేత కూడా ప్రచారం చేయిస్తున్నాడు. ఇప్పటికే ఆయన భార్య, కొడుకు పిఠాపురం నియోజకర్గంలో తిరిగారు. పూర్తిగా హైదరాబాద్‌కు చెందిన వీరికి ఇక్కడేం పనో.. చేయాల్సిందంతా చేస్తూ దొంగే దొంగ అన్న చందానా ఉంది జనసేన తీరు. ఎంతైనా నటులు కదా.. నిజజీవితంలో బాగా నటిస్తున్నారు.
అందరూ వస్తున్నారు కానీ పవన్ మూడో భార్య అన్నా లెజినోవా ప్రచారానికి రావడం లేదు. దీనికి కారణం ఏమై ఉంటుందని పిఠాపురంలో జనసైనికుల మధ్య చర్చ నడుస్తోంది. ఈ మిలియన్ డాలర్ల ప్రశ్నకి సేనాని వద్దే సమాధానం ఉంది. కానీ ఆయన నోరు మెదపడు. పక్కనోళ్లపై పడి గుక్కపెట్టి ఏడుస్తాడు.