మనలో చాలామంది ప్రభుత్వ బడిలో చదువుకున్న వారమే.. తరగతి గదిలో నేలపై కూర్చొన్నాం. పైకి చూస్తే కింద పడేందుకు సిద్ధమైన పెచ్చులు ఇంకా కళ్ల ముందే మెదిలి భయపెడుతుంటాయి కదా.. చెట్ల కింద పాఠాలు వినుంటాం. మరుగుదొడ్లు లేక ఆరుబయటకు వెళ్లినోళ్లమే.. బడిలో టీవీ ఉండటమే గొప్ప.. ఇక కంప్యూటర్ను ఊహించుకోగలమా..?, వేసవి సెలవులు పూర్తయ్యాక స్కూల్‌కి పోతే పాఠ్యపుస్తకాలు ఎంత ఆలస్యంగా ఇచ్చారో.. ఆనాడు తాగునీటికి గగనమే.. ఉదయాన్నే ఇంటి నుంచి బయటకొస్తే టై కట్టుకుని.. బూట్లు వేసుకుని, బ్యాగ్ తగిలించుకుని ఆటో లేదా బస్సు ఎక్కుతూ కనిపించిన పిల్లల్ని చూసి ఆసూయ పడిన వాళ్లు ఎందరో ఉన్నారు. ఇలా చెప్పుకొంటూ పోతే ఎన్నో.. మన బడి కష్టాల మధ్యే గడిచింది.
ఇప్పటి పిల్లలు చాలా అదృష్టవంతులు. వాళ్ల ప్రభుత్వ బడి అందంగా మారింది. పిల్లలు బూట్లు వేసుకుని.. బెల్టు కట్టుకుని.. బ్యాగ్ తగిలించుకుని గుడిలా మారిన బడికి నవ్వుతూ వస్తున్నారు. ప్రతి గోడ రంగులమయమైంది. సబ్జెక్టుల చిత్రాలతో తనివితీరా చూసేలా ఉన్నాయి. తరగతి గదిలో దర్జాగా బెంచీలపై కూర్చొని పాఠాలు వింటున్నారు. కార్పొరేట్లో చదివే పిల్లల్లాగే కంప్యూటర్ విద్య నేర్చుకుంటున్నారు. ప్రపంచంలోని అవకాశాలను ఒడిసి పట్టుకోవడానికి ఇంగ్లిష్ మీడియంలో పాఠాలు వింటున్నారు. ట్యాబ్‌లలో కొత్త విషయాలు తెలుసుకుంటున్నారు. బాలికలు ఒకప్పుడు మరుగుదొడ్లు లేక ఇబ్బందులు పడిన మాట వాస్తవం. నేడు ఆ పరిస్థితిని పేపర్లలో చదివి ఎంత కాలమైందో..
మనందరం ఆ రోజు ఇలా ఉంటే బాగుండేది అని కుళ్లుకునే స్థాయికి విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులొచ్చాయి. అన్నం ఉండికిందా లేదా అని తెలుసుకోవడానికి కొన్ని మెతుకులు పట్టుకుని చూస్తాం. అదే విధంగా మనకు దగ్గర్లోని ఒక ప్రభుత్వ బడికి వెళ్లి చూస్తే పిల్లల బతుకులు ఎంతలా మారాయో కనులముందు ఆవిష్కృతమవుతుంది. గత జ్ఞాపకాలు మెదిలినా.. కొత్త దృశ్యాలు మనకు విపరీతంగా నచ్చుతాయి. అందరికీ జగన్ నచ్చాలని లేదు. వ్యతిరేకించే వాళ్లకు చాలా కారణాలుంటాయి. కానీ నేడు సర్కారు బడిని చూస్తే ఆయన్ను అభినందించకుండా ఉండలేరు. ఇది అక్షరాల నిజం.
కూలి పనులు చేసుకునే తల్లిదండ్రుల కొడుకులు, కుమార్తెల్ని ఐక్యరాజ్యసమితికి పంపిన గొప్ప వ్యక్తి ఆయన. మన పిల్లల తలరాతలు మార్చేందుకు జగన్ ఎంచుకున్న ఆయుధం విద్య. ఆయన్ను తిట్టినా సరే సంస్కరణలు తీసుకొస్తూనే ఉంటాడు. పాఠశాల మారిందని మనమే ఇంత సంబర పడుతుంటే ఎక్కడైనా పిల్లలు కనిపిస్తే నవ్వుతూ ఆశీర్వదించే జగన్ మనసులో ఇంకెంత సంతోషపడుతుంటాడో.. మనకి తెలియకుండా ఆనందభాష్పాలు కూడా వచ్చే ఉంటాయి. జగనన్న మనసులో అనుకున్న చిత్రం శ్రద్ధగా పాఠాలు వింటున్న బాలికల రూపంలో సాక్షాత్కారమైంది.