మైలవరం నియోజకవర్గంలో ఓటమి భయంతో టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ చేస్తున్న దాడులతో నియోజకవర్గం మొత్తం అట్టుడికి పోతున్నది. రెండూ రోజుల క్రితమే ముస్లింల మీద అందులో ముస్లిం మహిళల మీద దాడి చేసిన సంఘటన మరువక ముందే ఇబ్రహీంపట్నం లోని కొటికలపూడి గ్రామంలో మైలవరం వసంత వెంకట కృష్ణ ప్రసాద్ అనుచరులు వీరంగం సృష్టించారు. ప్రచారంలో దళితుల ఇళ్ల పై దాడులు చేసిన సంఘటనలో ముగ్గురు దళితులు తీవ్రంగా గాయపడ్డారు. తరువాత దళితులకు అండగా గ్రామ ప్రజలు తిరగబడడంతో అక్కడి నుండి పలాయనం చిత్తగించారు.
ఇప్పటికే వసంత తన వ్యవహార శైలితో వివాదాస్పద వ్యాఖ్యలతో రోజు రోజుకీ శృతి మించిపోయి ప్రచారం చేస్తూ నియోజకవర్గంలో టీడీపీకి పెద్ద తలనొప్పిగా మారారు. అసలే నియోజకవర్గంలో టీడీపీ లోకి వసంత రాకను ఒప్పుకోక క్యాడర్ పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేశారు. అయిన చంద్రబాబుకు టీడీపీకి ఇచ్చిన కోట్ల రూపాయల ఫండ్ తో పార్టీ కార్యకర్తల అభిప్రాయాలకు విలువ లేకుండా టికెట్ సంపాదించారు. అప్పటి నుండి అటూ ముఖ్య నాయకులు కార్యకర్తలు వసంత రాకను జీర్ణించుకోలేక ప్రచారానికి దూరంగా ఉంటూ వస్తున్నారు. దీనితో ఓటమి భయం పట్టుకున్న వసంత అతని అనుచరులు ఎక్కడిక్కడ ప్రచారంలో వీరంగం సృష్టిస్తున్నారు. మొన్నటికి మొన్న ముస్లిం మీద దాడులు, ఇప్పుడు దళితుల మీద దాడులు చేసి ఇప్పటి వరకు ఆరుగురిని గాయపరిచారు. దీనిపై నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో అలజడి మొదలైంది. మైనారిటీ వర్గాలు , దళిత సంఘాలు, టీడీపీ తో పాటు మైలవరం టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ తమకు క్షమాపణ చెప్పాలని ప్రధాన డిమాండ్ చేస్తున్నరు. అంతే కాకుండా జిల్లాలో టీడీపీని ఓడించి తీరుతాం అంటూ ప్రకటించారు.
ఇప్పుడు ఈ ప్రకటనలు జిల్లా టీడీపీ అభ్యర్థులకు వణుకు పుట్టిస్తున్నాయి. వసంత కృష్ణప్రసాద్ వ్యవహార శైలితో మేము ఇబ్బందులు పడుతున్నాము అసలే ఎన్నికలు కురుక్షేత్ర సంగ్రామంలా నడుస్తున్న సమయంలో దళితులను , ముస్లింల మీద దాడులు చెయ్యడం ఏమిటి? దీని వలన మేము ఇబ్బందులు పడుతున్నాం అంటూ టీడీపీ శ్రేణులు గగ్గోలు పెడుతున్నారు.