మైలవరం నియోజకవర్గంలో ఓటమి భయంతో టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ చేస్తున్న దాడులతో నియోజకవర్గం మొత్తం అట్టుడికి పోతున్నది. రెండూ రోజుల క్రితమే ముస్లింల మీద అందులో ముస్లిం మహిళల మీద దాడి చేసిన సంఘటన మరువక ముందే ఇబ్రహీంపట్నం లోని కొటికలపూడి గ్రామంలో మైలవరం వసంత వెంకట కృష్ణ ప్రసాద్ అనుచరులు వీరంగం సృష్టించారు. ప్రచారంలో దళితుల ఇళ్ల పై దాడులు చేసిన సంఘటనలో ముగ్గురు దళితులు తీవ్రంగా గాయపడ్డారు. తరువాత దళితులకు అండగా గ్రామ […]
మైలవరంలో గెలుపు కోసం టీడీపీ అభ్యర్ధి వసంత కృష్ణ ప్రసాద్ దౌర్జన్యాలకు దిగుతున్నారు. ప్రచారంలో ముస్లిం వర్గీయులపై అందులో మహిళలపై దాడులకు తెగబడి గాయపరిచారు. ఇప్పటికే మీడియా ప్రతినిధులను, సొంత టీడీపీ పార్టీ కార్యకర్తలను వ్రాయలేని భాషలో తిట్టిన విషయం దాని మీద నియోజకవర్గంలో గొడవలు అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా వసంత కృష్ణప్రసాద్ తరుపున తన సతీమణి శిరీష కొండపల్లిలో 20వ వార్డు లో ప్రచారం చేస్తుండగా స్థానిక కౌన్సిలర్ […]
మైలవరం అధికార పార్టీ ఎంఎల్ఏ అయిన వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీని వీడి టీడీపీ లో జాయిన్ అయ్యి కూటమి తరుపున మైలవరం టికెట్ సంపాదించారు. టీడీపీలో ఈ టికెట్ కోసం బొమ్మసాని, దేవినేని ఉమామహేశ్వరరావు వర్గాలుగా చీలిపోయి గత సంవత్సర కాలంగా కొట్లాడుకుంటునే వున్నారు. అలాంటి చోట చంద్రబాబు నాయుడుకు వసంత కృష్ణప్రసాద్ ఒక ఆశ దీపంలా కనిపించి అటూ రెండు గ్రూపులను కాదు అని మూడో వ్యక్తి అలాగే పార్టీ కి వంద కోట్ల […]
ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం టికెట్ విషయంలో తెలుగుదేశంలో చిచ్చు రేగింది. మాజీ మంత్రి దేవినేని ఉమ తనకు సీటు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. అయితే అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ పంచాయితీ తెగేందుకు మరికొద్దిరోజుల సమయం పట్టేలా ఉంది. వసంత వైఎస్సార్సీపీ తరఫున గెలిచారు. అయితే ఈసారి ఆయనకు అధిష్టానం టికెట్ నిరాకరించింది. దీంతో టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. దీనిని ఉమ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. […]
టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు టీడీపీకి పార్టీకి దూరం కానున్నారా? టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా ముద్రపడిన దేవినేని ఉమను సామాజిక పరిణామాల రీత్యా పక్కన పెట్టేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారా? కృష్ణా జిల్లా రాజకీయాలను శాసించిన దేవినేని ఉమకు మైలవరం నియోజకవర్గంలోనే టికెట్ దక్కని పరిస్థితి నెలకొందా? అంటే అవుననే సమాధానం వచ్చే పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ సీనియర్ నేతగా రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన దేవినేని ఉమకు ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తుంది. […]