చంద్రబాబుకు ఎన్టీఆర్ తన కుమార్తెనిచ్చి వివాహం చేశాడు. తాను సీఎం అయ్యాక.. కాంగ్రెస్ నుంచి వచ్చిన అల్లుడిని చేరదీసి హోదా కల్పించారు. అయితే బాబు విషపూరిత మనస్తత్వం గల వ్యక్తి. లక్ష్మీపార్వతిని బూచిగా చూపించి వెన్నుపోటు పొడిచి సీఎం కుర్చీ లాక్కొన్నాడు. రామారావుపై చెప్పులేయించాడు. తన మనుషుల చేత నానా మాటలు అనిపించాడు. అల్లుడు చేసిన పనికి మామ తల్లడిల్లిపోయారు. ఇది అనైతికమని అనేక సందర్భాల్లో ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో నాడు రామారావు న్యాయ పోరాటానికి దిగారు. అలాగే తనకు జరిగిన అన్యాయాన్ని గుర్తించి న్యాయం చేయాలని కోరుతూ రాష్ట్రపతి శంకర్‌దయాళ్ శర్మ, ప్రధానమంత్రి పీవీ నరసింహారావుకు ఫ్యాక్స్ ద్వారా రెండు పేజీల లేఖలు పంపారు. అందులో స్థూలంగా ఏముందంటే.. ‘స్పీకర్ రామకృష్ణుడి వైఖరిని హైకోర్టు తప్పు పట్టింది. నాకు 31–8–1995 వరకూ అధికారంలో ఉండేందుకు అవకాశం ఉన్నా స్పీకర్ అంతకు ముందే బులెటిన్ జారీ చేసి చంద్రబాబును తెలుగుదేశం పార్టీ లెజిస్లేటివ్ పార్టీ నాయకుడిగా ప్రకటించడం దురుద్దేశపూరితం. నాకు అప్పటి వరకు మద్దతు ఇచ్చిన ఎమ్మెల్యేలు స్పీకర్ చర్యల వల్లే బాబు వైపు మళ్లారు. సీఎంగా బాబు ఎన్నిక కూడా టీడీపీ నియమావళి ప్రకారం జరగలేదు. అతను ఆ పదవిలో కొనసాగేందుకు అనర్హుడు. జరిగిన విషయాలను మీరు పరిశీలించి న్యాయం చేస్తారనే విశ్వాసంతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడి హోదాలో లేఖ పంపుతున్నా’ అంటూ రామారావు వివరించారు. కాగా ఆ సమయంలో ప్రజాస్వామ్యవాదులు బాబు, స్పీకర్ చర్యలను ఎంత తప్పుపట్టినా పట్టించుకోలేదు. మామ, అల్లుడు కూడా బహిరంగంగా ఒకరినొకరు తీవ్రంగా విమర్శించుకున్నారు. వెన్నుపోటు కారణంగా మనోవేదనకు గురైన ఎన్టీఆర్ చివరకు 1995 సంవత్సరం జనవరి 18వ తేదీన మరణించారు.