మీకు తెలుసా ఎన్టీఆర్ దేముడు, రాముడు, ఆయన ఆశయాల సాధన కోసమే చిత్తశుద్ధితో నడుస్తున్నాం అనే చంద్రబాబు ఆధ్వర్యంలోనే ఎన్టీఆర్ సభా హక్కుల ఉల్లంఘన నోటీసు అందుకొన్నారని.
1995 లో ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచి నాటి స్పీకర్ యనమల సహకారంతో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ సమావేశాలలో ఎన్టీఆర్ కి మాట్లాడే అవకాశం కూడా స్పీకర్ యనమల ఇవ్వకపోవడంతో కన్నీటి పర్యంతమైన ఎన్టీఆర్ సభ వెలుపల జరిగిన విలేఖరుల సమావేశంలో బాబు, యనమల కలిసి తన వెనక చేసిన కుట్ర గురించి ఆక్రోశం వెళ్ళగక్కారు.
ఈ విషయంలో తమ పరువు పోతుందని భావించిన బాబు, విలేకరుల సమావేశంలో ఎన్టీఆర్ స్పీకర్ యనమల పరువుకి భంగం కలిగించేలా మాట్లాడారంటూ నాటి టీడీపీ ప్రభుత్వ చీఫ్ విప్ ఎర్రన్నాయుడి చేత సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇప్పించారు.
పాపం ఎన్టీఆర్ ఊహించి ఉండడు. తన దయతో తన ఫొటో అడ్డం పెట్టుకొని తన చేతుల మీదుగా రాజకీయ భిక్ష పొందిన వారు తనకే నోటీసులు ఇచ్చి తన నోరు మూపిస్తారని