వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంఖారావ సిద్ధం సభకు స్పందన కరువైందట. వచ్చిన జనం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మాటలు వినలేక వెళ్లిపోతున్నారంట.. ఎల్లో మీడియా ప్రచారం ఇది. వారి దృష్టిలో ఇరుకు సందుల్లో జరిగే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడి సభలకే ప్రజలు వెల్లువల్లా వస్తున్నారు. అబద్ధం చెప్పినా అతికినట్లు ఉండాలి. కానీ పచ్చ గ్యాంగ్ జనాన్ని పిచ్చోళ్లని అనుకుంటోంది. చంద్రబాబు, లోకేశ్ సభలను ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇది వాస్తవం. దీంతో ఇరుకు సందుల్లో మీటింగ్లు పెట్టి టీడీపీకి మైలేజ్ పెరిగిందని చూపించేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో గతంలో కందుకూరులో బాబు సభలో తొక్కిసలాట జరిగి ఎనిమిది మంది చనిపోయారు. వారిలో టీడీపీ కార్యకర్తలు కూడా ఉన్నారు. దీనిపై నారా వారు కనీసం విచారం కూడా వ్యక్తం చేయలేదు. లైట్ తీసుకున్నారు. పైగా వైఎస్సార్సీపీపై నెపం నెట్టేందుకు ప్రయత్నించి అభాసుపాలయ్యారు. బాబు ఇప్పటికీ మారలేదు. రాష్ట్రంలోని చాలాచోట్ల ఇరుకు సందులను ఎంచుకుని మరీ సభలు పెట్టారు. టీడీపీ సోషల్ మీడియా, పచ్చ పత్రికలు వాటిని ఆహా ఓహో అని పొగిడాయి. ప్రజలు భారీగా తరలివచ్చారు.. ఇక వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే అని గగ్గోలు పెట్టారు. ఇలా చిన్నపాటి వీధుల్లో సభలు పెట్టొద్దని సర్కారు కోరితే దానిని మార్చి చెప్పి లబ్ధి పొందాలని చూశారు. లోకేశ్ పాదయాత్ర సమయంలో కూడా తక్కువ స్థలంలో సభలు పెట్టి తాము ఇంతేనని నిరూపించుకున్నారు. ఎవరైనా చనిపోతే సింపతీ కొట్టేయచ్చని వారి ఆలోచన.
సభలంటే ఇలా ఉండాలి
జగన్ పాదయాత్ర చేసిన సమయంలో అనేక సభలు జరిగాయి. ఎప్పుడు కూడా ఇరుకు వీధుల్లో పెట్టలేదు. భారీ కూడళ్లలో నిర్వహించారు. వాటికి జనం పోటెత్తారు. ఇప్పుడు సిద్ధం సభలను పక్కా ప్రణాళికతో నిర్వహిస్తున్నారు. వచ్చిన వారు ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. తొక్కిసలాటకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకున్నారు. దెందులూరులో సభను ఏకంగా వంద ఎకరాలకు పైగా ప్రాంగణంలో నిర్వహించారు. దీనికి జనం సునామీలా వస్తే పచ్చ పత్రికలకు నిద్ర కరువైంది. ప్రస్తుతం రా కదలి రా సభలకు స్పందన కరువైంది. అందుకే పిచ్చి రాతలు రాసి పడేశాయి. అయితే సిద్ధం సభలో వైఎస్సార్సీపీ శ్రేణులు, ప్రజల ఫొటోలు వైరలయ్యాయి. బాబూ కాస్త చూసి నేర్చకోవచ్చుగా..