నెల్లూరు సిటీ కూటమి అభ్యర్థిగా నారాయణ పోటి చేస్తున్నరు. రాష్ట్ర స్ధాయిలో ఈ సీటు మీద ఎవరు గెలుస్తారు అంటూ తీవ్ర స్థాయిలో బెట్టింగులు నడుస్తున్నాయి. నారాయణకు ప్రత్యర్థిగా వైసీపీ పార్టీ అత్యంత సామాన్యుడు అయిన మైనారిటీ నాయకుడినీ పోటీలో నిలబెట్టింది. మొన్నటి వరకు ఇక్కడ వైసీపీ నుండి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ రంగంలో వుండి మాటల తూటాలతో డీ అంటే డీ అని కొదమ సింహల్లా పోటీ వుండేది. అయితే అనిల్ కుమార్ యాదవ్ కు వైసీపీ పార్టీ నరసరావుపేట ఎంపీగా అవకాశం కల్పించి ఇక్కడ డిప్యూటీ మేయర్ మహ్మద్ ఖలీల్ కు ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించారు. ఎప్పుడైతే మహ్మద్ ఖలీల్ ప్రత్యర్ధి అనేసరికి నారాయణ వందల కోట్ల ఖర్చు ముందు తెలిపోతాడు మెజారిటీ ముప్పై వేలు దాటుతుంది అంటూ టీడీపీ నేతలు సంబరాలు జరుపుకున్నారు.
నారాయణ ప్రచారం ప్రారంభించిన తర్వాత కానీ అసలు విషయం బోధపడలేదు. ప్రచారం లో ఎక్కడికి పోయినా కరోన సమయంలో ఎక్కడ వున్నారు అంటూ ప్రజలు నిలదిస్తుంటే అసలు సిటీ లో తన గ్రాఫ్, టీడీపీ పార్టీ గ్రాఫ్ ఎలా వుందో అని 500 మందితో ఎన్ టీమ్ అని ఏర్పాటు చేసి టీడీపీ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అవకాశం లేకుండా సొంత సర్వే చేయించుకోగా దీనిలో షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి . నారాయణకు అనుకున్నంత స్థాయిలో ప్రజల సపోర్ట్ లేదు. వందల కోట్లు కుమ్మరిస్తున్న ప్రజల్లో బలం పెరగటం లేదు అని తేటతెల్లం అయింది. దీనితో ఆందోళనలో పడ్డ నారాయణ చుట్టూ వున్న పార్టీ నేతల మీద అరుస్తూ తిట్టడం మొదలు పెట్టారు . మొన్న ప్రచార సభకు జన సమీకరణ చెయ్యలేదు అని ఒక నాయకుడిని, జనాల్ని తీసుకురావడం తెలియదు అంటూ తిట్టి ప్రచార రథం నుండి దింపేసారు. దానితో అతను ప్రచారానికి రావడమే ఆపేసారు. మిగతా మహిళ నాయకులను కూడా నోటికొచ్చినట్లు తిడుతుండే సరికి వారు కూడా చిన్నగా పార్టీ తరపున ప్రచారానికి తిరగడం తగ్గించేశారు.
అప్పటి నుండి పార్టీ నేతలకు ప్రచార భాద్యతలు ఇవ్వకుండా తన ఎన్ టీమ్ కే ప్రచార భాధ్యతలతో పాటు పార్టీ కార్యక్రమాలు అన్ని అప్పగించారు. అదే సమయంలో తన టీమ్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండే సరికి కీలక నేతలు అందరు ఒక్కొక్కరిగా దూరం జరుగుతూ వస్తున్నారు. ఇది ఇలానే కొనసాగితే మరొక సారి నెల్లూరు సిటీలో నారాయణకు భంగపాటు తప్పదు అని సొంత పార్టీ నాయకులే అభిప్రాయ పడుతున్నారు.