తమ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన స్కాములను అలవాటుగా మార్చుకున్న టీడీపీనాయకుల బండారాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇప్పుడు తాజాగా మాజీ మంత్రి నారాయణ అల్లుడు ఏకంగా పది కోట్ల పన్ను ఎగవేయడంతో, ఆ నేరాలు వెలుగులోకొచ్చాయి. వాలంటీర్లు ఊళ్ళో చీటీ పాటలు ఎగ్గొడితేనే తాటికాయంత అక్షరాలతో రాసే పచ్చ మీడియాకి ఈ విషయాలు కనపడలేదు పాపం.
వివరాల్లోకి వెళితే.. ఇన్స్పైర్ మేనేజ్మెంట్ సర్వీస్ పేరుతో మాజీ మంత్రి నారాయణ అల్లుడు పునీత్ జీఎస్టీ ఎగొట్టాడు. సుమారు 84 వాహనాలకు జీఎస్టీ కట్టకుండా ప్రభుత్వాన్ని మోసం చేశారు. రూ.10 కోట్ల 32 లక్షలు దాకా కట్టాల్సి ఉంటే.. రూ. 22 లక్షల మాత్రమే జీఎస్టీ కట్టారు. అంటే 10 కోట్ల పన్ను ఎగవేశారు.
ఇక నారాయణ సమీప బంధువుల నివాసాల్లో సోదాలు చేసిన పోలీసులకు సరైన పత్రాలు చూపించనందున రూ. కోటి 82 లక్షలు నగదు సీజ్ చేశారు. పునీత్ డైరెక్టర్ గా ఉన్న ఇన్స్పైర్ మేనేజ్మెంట్ కేంద్రంగా రవాణా శాఖకు పన్నులు ఎగగొట్టారు. సొసైటీ పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకుని ప్రభుత్వానికి జీఎస్టీ కట్టలేదు. డీఆర్ఐ అధికారులు రవాణా శాఖకు ఫిర్యాదు చేయడంతో సోదాలు నిర్వహించారు.
ఈ వ్యవహారంపై నారాయణ అల్లుడు పునీత్ పై కేసు నమోదు చేశారు. నారాయణ ఎడ్యుకేషన్ సొసైటీకి అనుబంధంగా ఈ ఇన్స్పైర్ సొసైటీ ఉంది. అయితే బస్సులు కొనుగోలు సంబంధించి ఇన్వాయిస్ మాత్రం నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ పైన రిజిస్ట్రేషన్ చేశారు. నారాయణ విద్యా సంస్థల నుంచి ప్రతి నెలా అద్దె కడుతున్నారు. నారాయణ సంస్థలు కొన్నట్లు ఇన్వాయిస్లు కూడా లభించాయి. విద్యా సంస్థ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించి పర్సనల్ పనులకు వాడుకోవడం కూడా నేరమే అవడంతో నెల్లూరు జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్‌రెడ్డి తదుపరి చర్యలు తీసుకోనున్నారు.