నారా వారి వైపు ఉన్న ఏ నిజం గెలవాలో అర్ధం కాలేదు.. దేని కోసం పోరాటం.. ఎన్టీఆర్ గారి దగ్గర నుండి టీడీపీ పార్టీని చంద్రబాబు లాక్కున్న నిజం గెలవాలా.. ??? లేక 2014 నుండి 2019 వరకు చంద్రబాబు చేసిన భూదోపిడీ నిజాలు గెలవాలా.. ??? లేక చంద్రబాబు కులరాజకీయాలు మాత్రమే చేస్తాడనే నిజం గెలవాలా.. ??? అసలు ఏ నిజం గెలవాలి.. అసలు నిజం అంటూ నారా వారి నైజంలో ఉంటేనే కదా గెలుస్తుంది.
చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టై జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సమయంలో టీడీపీ పార్టీ వారు చిత్ర విచిత్ర నిరసనలు తెలిపారు. చేతులు చార్జింగ్ వైర్లతో కట్టేసుకోవడం, పేపర్లు తగలబెట్టడం, ఈలలు వేయడం, డప్పులు మోగించడం, బైక్ హరన్స్ మోగించడం.. ఇలా ఏవేవో విన్యాసాలు చేశారు. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కూడా ప్రజల్లోకి వచ్చి సభలు పెట్టి నిరసన తెలియజేశారు. అయితే నిజం గెలవాలి అంటూ ఒక బస్సు యాత్ర చేశారు. చంద్రబాబు అరెస్టైనందుకు ప్రజలు బాధతో చనిపోయారట.. వారిని కలిసేందుకు ఈ నిజం గెలవాలనే యాత్ర.. వారితో పాటు జనసేన కార్యకర్తలను కూడా కలిసి పరామర్శించడం యాత్ర ఉద్దేశం.. మొత్తానికి ఇదో బిసి బేలే బాత్ యాత్ర..
ఇప్పుడు ఆ నిజం గెలివాలి అనే యాత్ర ఏమైందో ఎవరికీ తెలియదు.. మధ్యంతర బెయిల్ పై చంద్రబాబు జైలు నుండి బయటకు రాగానే ఆ యాత్ర గాలికి కూడా దొరకనంత స్పీడ్ గా మాయమైపోయింది. బెయిల్ వస్తే నిజం గెలిచేసినట్టేనా.. ఇక్కడ నిజం గెలవాలి యాత్ర ఉద్దేశం ప్రజల్లో సానుభూతి.. ప్రభుత్వంపై వ్యతిరేకత వెల్లగక్కడం కోసం మాత్రమే.. నిజంగా నిజం గెలవాలని కోరుకుంటే మధ్యలోనే బస్సు యాత్రను ఎందుకు ఆపెయ్యాలి.. కేసు తుది తీర్పు వచ్చే వరకు పోరాడాలి కదా.
చంద్రబాబు సతీమణి భవనేశ్వరి ప్రజల్లోకి రావడం చాలా తక్కువ.. అలాంటి ఆవిడను చంద్రబాబు జైలులో ఉన్నప్పుడు రాజకీయ అస్త్రంలా వాడి బస్సుయాత్ర పేరుతో కొద్దిరోజులు రాష్ట్రంలో డ్రామా చేశారంతే. అందుకే చంద్రబాబు నాయుడు బెయిల్ పై బయటకు వచ్చాక ఆవిడ ఇంటికే పరిమితం అయ్యారు. బస్సు యాత్ర కోసమే ముస్తాబు చేసిన బస్సులు మూలన పడ్డాయి.
చంద్రబాబు జైలులో ఉన్నప్పుడు అరెస్ట్ అక్రమం, అన్యాయం అంటూ రోడ్డెక్కిన ఆయన కుటుంబం బెయిల్ వచ్చాక పత్తా లేకుండా పోయారు. నారా బ్రహ్మణి తరువాత కనపడలేదు, భువనేశ్వరి గారి బస్సు యాత్ర అటకెక్కింది, లోకేష్ లీవ్స్ మధ్యలో పాదయాత్ర అంటూ అప్పుడప్పుడు ఈవినింగ్ వాక్ చేస్తున్నాడు. మొత్తం అరెస్ట్ గోలలో ఫుల్ కామెడీ ఏంటంటే.. ఆ ఇంటి నుండి ఇద్దరు ఆడవారు బయటకు వచ్చి ఏదో ఒకటి పొంతనలేని మాటలైన మాట్లాడారు కానీ.. వారసుడు మాత్రం దూరంగా ఢిల్లీలో దాక్కున్నాడు.