2014 లో ప్రతి వర్గానికి ఏదొక హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు, అతని తనయుడు లోకేష్ గెలిచిన తరువాత ఇచ్చిన మేనిఫెస్టోని డిలీట్ చేసుకొని హామీలను గాలికి వదిలేశారు. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు సమీపిస్తున్నడంతో నోటికి వచ్చిన హామీని ఇస్తున్నారు. తాజాగా మంగళగిరిలో అధికంగా ఉన్న చేనేతలకు మరోసారి 2014 లో ఇచ్చిన హామీలనే మరోసారి 2024 లో అధికారంలోకి వస్తే ఇస్తామని హామీ ఇస్తున్నారు. చేనేతలకు జీఎస్టీ రద్దు చేస్తాము అని ముడి సరుకు ధరలు తగ్గిస్తాము సబ్సిడీ ఇస్తాము, మెరుగైన మార్కెటింగ్ సౌకర్యాలు కల్పిస్తాం అని ప్రత్యేకమైన హామీలను గుప్పించారు. ఇదే లోకేష్ అతని తండ్రి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కలిసి 2014 లో చేనేత వర్గాలకు కొన్ని హామీలను ఇచ్చి ఒక్కటి కూడా నెరవేర్చలేదు, పైగా చేనేత వర్గాలను మోసం చేసికొన్ని కోట్ల రూపాయల స్కాంలు చేశారు.
గతంలో చంద్రబాబు నాయుడి పార్టీ చేనేత సహకార సంఘాల భవనాలకు ఆస్తి పన్ను నుండి మినహాయింపులు ఇస్తామని హామీ ఇచ్చి ఎగ్గొట్టారు. జిల్లాకు ఒక చేనేత పార్క్ ఏర్పాటు చేసి శిక్షణా, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చేనేత పార్క్ ఏర్పాటు చెయ్యలేదు, శిక్షణా ఇవ్వలేదు. ఇంకా సీజన్ లేని సమయం, డిమాండ్ తక్కువ వున్న టైంలో చేనేత ఉత్తత్తులు దాచుకునేందుకు నిల్వ సౌకర్యం, నిల్వ సరుకు పై ఋణాలు ఇప్పిస్తము అని చెప్పి మోసం చేశారు. చేనేతలకు తక్కువ వడ్డీకే రుణాలు ఇప్పిస్తాం అని హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు తమ ప్రభుత్వము ఏర్పడ్డా తరువాత కనీసం చేనేతలకు గుర్తింపు కార్డులు ఇవ్వకపోవడంతో అసలు రుణాలే ఇవ్వలేదు బ్యాంకులు.
ఇంకా వృద్ధ చేనేతల కోసం మంగళగిరి, ఉరవకొండ, పెడన, చీరాల, ధర్మవరం లో ప్రత్యేక ఆస్పత్రులు, వృద్ధాశ్రమాలు కట్టిస్తాము అని హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడి ప్రభుత్వం వృద్ధ చేనేతలకు కనీసం ఒక్క ఆస్పత్రి, ఒక్క వృద్ధాశ్రమం కూడా కట్టించలేదు. అంతటితో ఆగకుండా రాష్ట్ర వ్యాప్తంగా చేనేత బజారులు ఏర్పాటు చేస్తామనే హామీ ఇచ్చి గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని హామీలు చేసినట్టే దీన్ని కూడా తుంగలో తొక్కారు చంద్రబాబు నాయుడు. చేనేత విక్రయాలపై ముప్పై శాతం రిబేట్ ఇస్తామని హామీ ఇచ్చి చివరకు అన్నీ హామీల్లాగే దీనిని బుట్ట దాఖలు చేశారు. చేనేతల పిల్లల చదువుల కోసం ప్రత్యేక ప్యాకేజీ, ఆస్పత్రి అని హామీ ఇచ్చి పిల్లల చదువులకు ప్రత్యేక ప్యాకేజీనీ, ఆస్పత్రిని ఎగ్గొట్టారు. చివరగా చేనేత విభాగ ఆధునీకరణకు ఒక విభాగం ఏర్పాటు చేస్తా అని విభాగం ఏర్పాటు చెయ్యలేదు కనీసం ఆధునీకరణకు చర్యలు తీసుకోలేదు.
ఆలాంటి చంద్రబాబు నాయుడు, లోకేష్ కలిసి మళ్ళీ చేనేత వర్గానికి మోసపూరిత హామీలు ఇస్తూ ఓట్ల రాజకీయానికి తెర తీశారు. గతంలో చంద్రబాబు నాయుడి ప్రభుత్వ మోసాలను చూసిన చేనేత వర్గాలు లోకేష్ హామీలను విశ్వసిస్తారా లేదా అనేది వేచి చూడాలి.