వైజాగ్‌పై నాడలా.. నేడిలా – నారా లోకేశ్ రెండు నాలుకల ధోరణి
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ప్రతి విషయంలో రెండు నాలుకల ధోరణి కలిగి ఉంటారు. వారి బాట అందితే జట్టు.. అందకపోతే కాళ్లు అనే విధానంలోనే ఎప్పుడూ ఉంటుంది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖపట్నంను ఒక రాజధానిగా ప్రకటించి అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తోంటే దుష్ప్రచారం ఎల్లో గ్యాంగ్ చేస్తోంది. అదే తండ్రీకొడుకులు మొన్నటి వరకు ఈ ప్రాంతం రాజధానిగా పనికిదాని గగ్గోలు పెట్టారు. తమ రియల్ ఎస్టేట్ వెంచర్ అమరావతే ఏకైక రాజధాని అని ప్రకటించారు. ఇప్పుడేమో తాము అధికారంలోకి వస్తే విశాఖను ఐటీ హబ్‌గా అభివృద్ధి చేస్తామని లోకేశ్ ఆర్భాటంగా తెలిపారు. పెందుర్తిలో జరిగిన శంఖారావం సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వైజాగ్‌ను రెండో ఆర్థిక, వైద్య పరికరాల హబ్‌గా తయారు చేస్తామని వెల్లడించారు. పనిలో పనిగా సీఎం జగన్, మంత్రులు తదితరులపై అబద్ధాలను ప్రచారం చేశారు.
అసలు ఇదే లోకేశ్ దొడ్డిదారిన ఐటీ మంత్రి అయ్యాక విశాఖ విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో విశాఖపట్నంలో పర్యటించిన సమయంలో ఈ ప్రాంతంలో సోషల్ ఎకో సిస్టం లేదు. డైరెక్ట్ ఫ్లైట్లు లేవు. అంతర్జాతీయ ప్రమాణాలున్న స్కూళ్లు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాలను వదిలి ఇక్కడికి రావడానికి ఐటీ కంపెనీలు సిద్ధంగా లేవన్నారు. ఇప్పుడు జగన్ ఈ ప్రాంతంలో వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేయిస్తుంటే ఎల్లో మీడియా సహకారంతో దుష్ప్రచారానికి తెగబడ్డారు. విశాఖ రూపురేఖలు మార్చింది చంద్రబాబేనని డబ్బా కొడుతున్నారు. అసలు ఇక్కడ ఏమి లేవని చెప్పడానికి లోకేశ్‌కు సిగ్గుగా అనిపించలేదేమో.. ఈ లెక్కన ఆయన నా తండ్రి సీఎంగా చేసినప్పుడు విశాఖపట్నంను పట్టించుకోలేదని ఒప్పుకొన్నట్లే కదా..
ఇక్కడికి ఐటీ కంపెనీలు రావడం కష్టమేనన్న లోకేశ్ ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయని మోసం చేసేందుకే కదా హామీలిస్తున్నారు. ఐటీ మంత్రిగా ఉన్న సమయంలో కంపెనీలు తీసుకునిరాని ఆయన నేడు ఐటీ హబ్‌గా అభివృద్ధి చేస్తామని చెప్పారు. దీనిని బట్టి తండ్రీకొడులకు వైజాగ్‌పై ఏ మాత్రం ప్రేమ లేదని, ఓట్లు దండుకునేందుకు ప్రయత్నిస్తున్నారని తేలిపోయిది.
విశాఖపట్నం అభివృద్ధిపై మొదటి నుంచి జగన్ ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. ఇటీవల నీతి ఆయోగ్ గ్రోత్ హబ్‌లో ఈ నగరానికి చోటు దక్కిందంటే అది జగన్ చేసిన కృషే. ఇంకా శంషాబాద్ నుంచి విశాఖకు హైస్పీడ్ రైలు నడిచేందుకు రైల్వే శాఖ సర్వే చేస్తోంది. దీనిపై ఏపీ సర్కారు ప్రత్యేక శ్రద్ధ పెట్టిన విషయం తెలిసిందే. ఐటీ కారిడార్‌గా అభివృద్ధి చేసేందుకు వేగంగా అడుగులు పడ్డాయి. రుషికొండ ఐటీ సెజ్‌లో హిల్ నంబర్–2లో ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని సీఎం జగన్ ప్రారభించారు. వెయ్యి మంది ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్ కార్యకలాపాలు మొదలయ్యాయి. అంతర్జాతీయ సదస్సులు ఇక్కడ జరుగుతున్నాయి. ప్రభుత్వం ఇన్వెస్టర్ల సమ్మిట్ నిర్వహించింది. జీ–20 సన్నాహక సదస్సు, ఐటీ సదస్సులు జరిగాయి. రూ.500 కోట్లకు పైగా నిధులతో రోడ్ల రూపురేఖలు మార్చేశారు. స్టార్ హోటళ్లకు కేరాఫ్‌గా ఈ ప్రాంతం మారింది. పరిశ్రమలు వస్తున్నాయి. నాలుగేళ్లలో విశాఖ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. అదే పచ్చ గ్యాంగ్ కడుపు మంట. మాయమాటలు చెప్పి ఓట్లు దండుకునే అవకాశాన్ని జగన్ లేకుండా చేశారని, ఆయనపై బురద వేస్తున్నారు.
వైజాగ్‌లో ఇంత జరిగితే లోకేశ్ ఇప్పుడొచ్చి గతంలో చాలా చేశాం. మళ్లీ అవకాశమిస్తే ఏదో చేస్తామని చెబుతున్నారు. స్వార్థం కోసం ఏమైనా చెప్పే చంద్రబాబు, ఆయన తనయుడిని ఉత్తరాంధ్ర ప్రజలు నమ్మేందుకు సిద్ధంగా లేరు.
– వీకే..