తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే మరిన్ని స్కిల్ డెవలప్మెంట్ స్కాంలు చేస్తామని చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేశ్ పరోక్షంగా చెప్పేశారు. తమకు డబ్బే ముఖ్యమని, యువత పేరు చెప్పి సంపాదించుకుంటామని హింట్ ఇచ్చారు. బుధవారం నెల్లూరు నగరంలోని వీఆర్సీ మైదానంలో లోకేశ్ యువతతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో యువతలో స్కిల్ డెవలప్మెంట్ పెంపొందించేందుకు వివిధ పోగ్రామ్స్ను ముందుకు తీసుకువెళ్తామని ప్రకటించారు. ప్రస్తుతం ఇదే హాట్‌టాపిక్‌గా మారింది.
2014లో అధికారంలోకి వచ్చిన బాబు స్కిల్ డెవలప్మెంట్ పేరుతో కోట్లాది రూపాయలు దోచేశారు. జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీకి తెలియకుండా దాని పేరుతో బాబు బృందం ఓ ప్రాజెక్టును సృష్టించి రూ.241 కోట్లు కొట్టేసింది. ఈ కేసుపై ఈడీ కొరడా ఝుళిపించింది. షెల్ కంపెనీల ప్రతినిధులను అరెస్ట్ చేయడంతోపాటు డిజైన్ టెక్ అనే కంపెనీ బ్యాంక్ డిపాజిట్లను జప్తు చేసింది. ఇక సిట్ షెల్ కంపెనీ ప్రతినిధులు, అప్పటి అధికారులను అరెస్ట్ చేసింది. గతేడాది చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. 50 రోజులకు పైగా రాజమండ్రి జైల్లో ఉన్నారు. తొలుత అనారోగ్య కారణాలను సాకుగా చూపించి హైకోర్టు నుంచి మధ్యంత బెయిల్ తెచ్చుకున్నారు. ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ వచ్చింది.
ఈ కేసు ఇంకా నడుస్తున్నా బాబు, ఆయన తనయుడు స్కిల్ డెవలప్మెంట్ను మరిచిపోలేకపోతున్నారు. టీడీపీ ప్రభుత్వంలో ఆ కార్యక్రమం అనేది బూటకం. తెలుగు తమ్ముళ్లకు కాసులు కురిపించింది. అందుకే తాము అధికారంలోకి వస్తే మళ్లీ దానిని చేపడతామని తండ్రీకొడుకులు పదేపదే ఎన్నికల ప్రచారంలో చెబుతున్నారు. దీనిని బట్టి మళ్లీ ఆ స్కాంను చేస్తామని స్పష్టం చేస్తున్నారు. 2014లో పవర్లోకి రాగా కాగితాలపైనే స్కిల్ డెవలప్మెంట్ను చూపించి కోట్ల రూపాయలు కొట్టేశారు. మరోసారి అవకాశం వస్తే ఎందుకు వదులుకుంటారు.. ఈసారి పక్కాగా స్కాం చేసి డబ్బులు జేబులో వేసుకుంటారని ప్రచారం ఉంది. దొరక్కకుండా ఉండేందుకు ఇప్పటి నుంచే వ్యూహాలు వేస్తున్నట్లు తెలుస్తోంది.
సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల విడుదల చేసిన మేనిఫెస్టోలో యువతకు వరాలు ప్రకటించారు. రాష్ట్రంలోని 175 స్కిల్ హబ్‌లు, 25 స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలు, ఒక స్కిల్ యూనివర్సిటీని అభివృద్ధి చేస్తూ.. వాటిలో నైపుణ్య శిక్షణ పొందే యువతకు ప్రతి నెలా పెయిడ్ ఇంటర్న్‌షిప్ ఇస్తాం. అబ్బాయిలకు రూ.2,500, అమ్మాయిలకు రూ.3,000 ఇస్తామని చెప్పారు. చెప్పింది చేయడం ఆయనకే సాధ్యం. చంద్రబాబు, లోకేశ్‌కు అధికారం అప్పగిస్తే స్కాంలు చేస్తారు తప్ప మంచి చేయరు.