నందమూరి జయకృష్ణ కుమారుడు నందమూరి చైతన్య కృష్ణ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పై మండిపడ్డారు. ఇప్పుడు ఈ టాపిక్ సోషల్ మీడియాలో సినిమా హీరోల ఫ్యాన్స్ మధ్య చర్చకు దారితీసింది. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని చెబుతూ ఎవరైతే గడిచిన ఎన్నికల్లో వైసీపీకి, మరీ ముఖ్యంగా కొడాలి నానికి, వల్లభనేని వంశీకి ఎన్నికల్లో మద్దతు పలికారో వారందిరిని తాను హెచ్చరిస్తున్నానని, మీరు వైసీపీకి మద్దతు పలికినా మా బొచ్చుకూడా పీకలేరని, తాను ఉండగా చంద్రబాబు మామయ్యని, బాలకృష్ణ బాబాయిని టచ్ కూడా చేయలేరని, నా సినిమా రిలీజ్ అప్పుడు కూడా వైసీపీ వారితో కలిసి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తనని ట్రోల్ చేశారని వీరందరు జాగ్రత్తగా ఉండాలని అంటూ తీవ్ర స్థాయిలో హెచ్చరిచ్చారు.
ఈ దేశంలో ప్రతీ పౌరునికి రాజకీయంగా ఎవరికైనా మద్దతుపలికే స్వేచ్చ రాజ్యాంగం కలిపించిన హక్కు. అయితే చైతన్య కృష్ణకి మాత్రం రాజ్యాంగం కల్పించిన ఆ హక్కు పెద్దగా నచ్చినట్టు లేదు. నందమూరి కుటుంబంలోనే పురంధేశ్వరీ బీజేపీలో ఉంటూ కూటమి కలవక ముందు వరకు చంద్రబాబుకి ప్రత్యర్ధిగానే ఉన్నారు. ఆ సమయంలో ఆమెకు మద్దతు పలికిన కార్యకర్తలపై లేని వ్యతిరేకత జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పై ఎందుకనే ప్రశ్న ఇప్పుడు వారి నుండి వస్తుంది. ఫ్యాన్స్ గా ఎవరికి రాజకీయ మద్దతు పలకాలో ఈయన ఎలా డిక్టేట్ చేస్తాడని వారంటున్నారు. ఇక సినిమాల పరంగా నటన బాగుంటే మెచ్చుకోవడం బాగోకపొతే విమర్శించడం జరుగుతుందని, ఆయన తీసిన బ్రీత్ సినిమా డిజాస్టర్ గా నిలిచిందని, లోపం ఆయనలో పెట్టుకుని అసభ్య పదజాలంతో ఫ్యాన్స్ ని హెచ్చరిస్తే మరింత ట్రోల్ కి గురవ్వడం తప్ప ఫలితం లేదని వారు చెబుతున్న మాట.
నందమూరి కుటుంబంలో జయకృష్ణ కుమారుడిగా ప్రజలకి పరిచయస్తుడైన చైతన్య కృష్ణ అప్పుడప్పుడు రాష్ట్ర రాజకీయాలపై సోషల్ మీడీయా వేదికగా స్పందిస్తూనే ఉన్నారు. అయితే ఈసారి జూనియర్ ఫ్యాన్స్ పై ఆయన చేసిన కామెంట్స్ మాత్రం ఫ్యాన్స్ మధ్య చిచ్చురేపే విధంగా ఉన్నాయని అంటున్నారు. ఇప్పటికే ఆ కుటుంబంలో జూనియర్ ఎన్టీఆర్ పై ఎప్పుడు ఏదొక రూపంలో వివక్ష కనపరుస్తూనే ఉంటారనే వాదన ఉన్న నేపథ్యంలో చైతన్య కృష్ణ చేసిన ఈ వాఖ్యలు మరింత దూరాన్ని పెంచేవిగా ఉన్నయని అంటున్నారు. నిజానికి ఆ కామెంట్స్ ఆయనే పెట్టారా లేదా అనేది వివరణ ఇస్తే బాగుంటుందని మరి కొందరు కోరుకుంటున్నారు.