బిల్డప్ బాబాయిలా హామిలిచ్చేసి వాటిని అమలుచేయాల్సి వస్తే గజినీలా మారిపోయే చంద్రబాబు గిరిజనుల అభివృద్ధి తెలుగుదేశంతోనే సాధ్యమని తన టీడీపీ పత్రిక చైత్యనరథంలో రాసుకున్నాడు. కానీ ఒకసారి చంద్రబాబు గిరిజనులకిచ్చిన హామీలను వాటి అమలుకు తీసుకున్న చర్యలను గమనిస్తే భయంకర నిజాలు బయటపడతాయి. అసలు గిరిజనుల అభివృద్ధికి వీసమెత్తు కృషి కూడా చేయని చంద్రబాబు గతంలో గిరిజనులకిచ్చిన హామీలను ఓసారి పరిశీలిద్దాం.
2014లో గిరిజన సోదరులకు 20కి పైగా హామీలు ఇచ్చిన చంద్రబాబు చిత్త శుద్ధితో ఒక్క హామీని కూడా అమలు పరచలేదన్నది వాస్తవం. 50 సంవత్సరాల వయసు కలిగిన గిరిజన సోదరులకు వెయ్యి రూపాయిలు ఫించన్ ఇస్తా అని ఆ హామీ ఇచ్చానన్న సంగతి కూడా చంద్రబాబు మరిచిపోయాడు. భూమిలేని గిరిజన కుటుంబాలకి 2 ఎకరాలు భూమి కొనిస్తామని అబద్దపు హామీనిచ్చి ఒక్క గిరిజన కుటుంబానికి కూడా భూమి ఇచ్చిన దాఖలాలు లేవు. గిరిజన తండాలన్నింటికీ మౌలిక సదుపాయాల కల్పించి, సౌర విద్యుత్ ఏర్పాటు చేస్తామని కల్లబొల్లి కబుర్లు చెప్పిన చంద్రబాబు తూతూమంత్రంగా కొన్నిటికి వేసి 90 శాతం తండాలకు మాత్రం మొండిచెయ్యి చూపించాడు. 2014 కి ముందే 10 సంవత్సరాలు సీఎంగా పనిచేసినా కూడా గిరిజన తండాలకు చంద్రబాబు రోడ్లు వేయకపోవడాన్ని ప్రజలందరూ గమనించాల్సిన అవసరం ఉంది.
అంతేకాకుండా జిల్లాకు ఒక గిరిజన భవన్ కడతానని హామీనిచ్చి, కనీసం ఒక జిల్లాలో ఒక భవనానికి కూడా శంకుస్థాపన చేయలేదు. గిరిజన జనాభా ప్రాతిపదికన ప్రభుత్వ నామినేటెడ్ పోస్టుల్లో గిరిజనులకు అవకాశం కల్పిస్తానని చెప్పుకొచ్చిన చంద్రబాబు ఎంత మందికి అవకాశం కల్పించాడో ఆ బాబుకే తెలియాలి. గిరిజన ఉప ప్రణాళిక నిధులను గిరిజనుల అభివృద్ధికే అని మాయమాటలు చెప్పి గాలికి వదిలేసాడు. గిరిజనులకు ప్రతి యూనివర్సిటీలో, ఇతర పాలక మండళ్ళలో అవకాశం కల్పిస్తామని ఆశ కల్పించి, ఆ దిశగా ఒక్క అడుగు కూడా వేయని చంద్రబాబు, గిరిజనలుకు ప్రత్యేక కమీషన్ నియమిస్తామని మరో అబద్దపు హామీనిచ్చి ఆ హామీ ఇచ్చానన్న సంగతిని కూడా మర్చిపోయాడు. గిరిజన యూనివర్సిటీ నిర్మిస్తానని గాల్లోమేడలు కట్టిన బాబు ఒక్క ఇటుకరాయిని కూడా గిరిజన యూనివర్సిటీ కోసం కేటాయించలేదు.
గిరిజన విద్యార్థులకు ప్రత్యేక స్కాలర్షిప్, నిరుద్యోగులకు అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచే నిరుద్యోగభృతి, ఉపాధి అవకాశాలకు కోసం ప్రత్యేకంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, గిరిజనుల కోసం ప్రత్యేక మార్కెట్లు, ప్రకృతి సంపదపై పూర్తి హక్కులు, గిరిజన ప్రాంతాలలోని ఆలయంలోనీ పూజారులుకు రూ.5000 ఇస్తా ఇలా ఇవ్వని హామీ అంటూ లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో హామీలిచ్చేసి ఇచ్చిన హామీలను గాలికొదిలేసిన చంద్రబాబు, చెప్పేది కొండంత చేసింది శూన్యం అన్నట్లు మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇంకెన్ని హామీలతో వస్తాడో అని తలచుకుంటేనే భయపడాల్సిన పరిస్థితి తలెత్తింది. గిరిజన ప్రాంతాలలో 90 నెట్వర్క్ టవర్లు ఏర్పాటు చేసి అందరికీ కనెక్టివిటీ ఉంటుందని బీరాలు పలికిన చంద్రబాబుకు జగన్ ప్రభుత్వం షాక్ ఇచ్చిందనే చెప్పాలి. గిరిజనుల ప్రాంతాల్లో కనెక్టివిటీ కోసం 400 నెట్వర్క్ టవర్ల ను ఏర్పాటు చేసింది. ఇచ్చిన హామీలు పేపర్ స్టేట్మెంట్స్ కి మాత్రమే పరిమితం కాకూడదు చెప్పిన వాటిని తూచా తప్పకుండ జగన్ ప్రభుత్వంలా నెరవేర్చాలి. అప్పుడే ప్రజలకు ప్రభుత్వంపై నమ్మకం పెరుగుతుంది. అడగకుండానే హామీలిచ్చేసి తర్వాత మేనిఫెస్టోనే మాయం చేసే చంద్రబాబుకు అసలు చిత్తశుద్ధి ఉందా ప్రజల్లో తలెత్తే చిన్న ప్రశ్న ఇది..