తాము అధికారం లోకి వస్తే 4% ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ప్రకటించినట్లుగా ఓ న్యూస్ క్లిప్ వైరల్ కాగా అది ఫేక్ అని అలాంటి ప్రకటనేదీ తాము చేయలేదని పురందేశ్వరి చెప్పుకొచ్చారు..
అయితే ముస్లిం రిజర్వేషన్లు తీసేస్తారా లేదా అన్నది మాత్రం ఆవిడ క్లారిటీ ఇవ్వనేలేదు. ఆవిడ ఆ వార్త ఫేక్ అని ప్రకటించారు కాబట్టి ముస్లిం రిజర్వేషన్లు తీసెయ్యరు అని పరోక్షంగా అన్నట్లే అని భావించాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఇది వారి పార్టీ స్టాండ్ కి పూర్తిగా విరుద్ధం. మొన్నీమధ్య తెలంగాణ ఎన్నికల ప్రచారం లో భాగంగా బిజెపి జాతీయ నాయకుడు, కేంద్ర హోమ్ శాఖా మంత్రి బహిరంగ సభలో ప్రసంగిస్తూ తెలంగాణ లో ఉన్న 4% ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం అని మేము అధికారంలోకి వస్తే ఆ రిజర్వేషన్లు తీసివేస్తాం అని ప్రకటించాడు అమిత్ షా…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో డాక్టర్ వైయస్సార్ సీఎం గా ఉన్నప్పుడు పేద ముస్లిం లకు 4% రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేశారు. ఆ రిజర్వేషన్లే ఇప్పుడు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లలో అమలు అవుతున్నాయి. తెలంగాణ లో రిజర్వేషన్లు రద్దు చేసిన వారు ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేయరా? తెలంగాణలో ఒక విధానాన్ని, ఏపీ లో మరో విధానాన్ని అయితే పాటించరు కదా? తెలంగాణ లో రద్దు చేస్తాం అంటే ఆంధ్ర లో కూడా రద్దు చేస్తాం అనే అర్థం. మరి ఇప్పుడు పురందేశ్వరి ప్రకటిస్తే ఏంటీ ప్రకటించకపోతే ఏంటీ? పార్టీ విధానం అయితే అదే కదా? రద్దు చేస్తారా? చేయరా? క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత వారిదే…
ఇక ఆటలో అరటి పండు లాంటి టీడీపీ ఈ వార్త గురించి స్పందిస్తూ తమ సోషల్ మీడియా ఖాతాలో ఈ వార్త ఫేక్ అని, వైసీపీ మత కల్లోలాలు శృష్టించాలని చూస్తుంది అని రాసుకొచ్చారు. మతకల్లోలాలు అంటే ఒక మతం వారు మరో మతంపై కక్ష్యతో దాడులు చేసుకోవడం. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తా అంటే ఏ మతం వారు ఏ మతంపై అల్లర్లకు దిగుతారు? ఓ రాజకీయ పార్టీ రిజర్వేషన్లు రద్దు చేస్తా అంటే ఆ వర్గం సదరు పార్టీ కి వ్యతిరేకంగా ఓటు వేయొచ్చు, లేదా ఇతరులను కూడా ఓటు వెయ్యకండి అని ప్రచారం చెయ్యొచ్చు. అంతేగాని సంబంధం లేకుండా మరో మతం వారిపై దాడులకు దిగి గొడవలు చేయరు. అది మతకల్లోలం అవ్వదు. మరి ఈ లెక్కన వైసీపీ పార్టీ మతకల్లోలాలు శృష్టిస్తుంది అని లోకేష్ ఆద్వర్యం లోని సోషల్ మీడియా భావిస్తూందో? ఇది వర్ధంతికి శుభాకాంక్షలు చెప్పే చావు తెలివే…