కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ పార్టీ తీసుకుంటున్న విధాన నిర్ణయాలు ఆ పార్టీతో కూటమి కట్టి తిరుగుతున్న తెలుగుదేశం , జనసేన అభ్యర్ధుల మెడకు చుట్టుకుని ఊపిరాడనీయడంలేదు . కూటమి అభ్యర్ధులం అంటూ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా ముఖ్యంగా ముస్లిం సమాజం నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవ్వడంతో వారికి ఎలా సమాధానం చెప్పాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు టీడీపీ, జనసేన నాయకులు
కర్నాటకలో హిజాబ్ రగడ , యూపీలో అజాన్ రగడ మర్చిపోక ముందే దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి కోర్టులతో పోరాడి ముస్లిం సమాజానికి సాదించి పెట్టిన 4% రిజర్వేషన్లు తాము అధికారంలోకి రాగానే రద్దు చేస్తాం అని అమిత్ షా నుండి పియూష్ గోయల్ వరకు బహిరంగంగానే ప్రకటనలు చేయడం ముస్లిం సమాజాన్ని తీవ్ర ఆందోళనకు గురించేస్తుది. బీజేపీతో పొత్తులో ఉన్న తెలుగుదేశం , జనసేన పార్టీలు సైతం దీనిపై మాట్లాడకుండా దాటవేసే దోరణిని ప్రదర్శించడం వారిని మరింత కలవరానికి గురించేస్తుంది.
ఈ నేపధ్యంలో ఎన్నికల ప్రచార నిమిత్తం ఓట్లు కోసం ప్రచారానికి వెలుతున్న జనసేన, తెలుగుదేశం నేతలను ముస్లిం సమాజం తీవ్రంగా ప్రశ్నిస్తుంది. బీజేపీ ఒక పక్క తమ పొట్టకొట్టే విధానాలతో ముందుకు వస్తుంటే ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని మా ఓట్ల కోసం రావడానికి సిగ్గు లేదా అంటూ ఘాటుగానే ప్రశ్నిస్తుంది ముస్లిం సమాజం. రాష్ట్రంలో 2011 లెక్కల ప్రకారం 32 నియోజకవర్గాల్లో విజయావకాశాలపై ప్రభావం చూపే సంఖ్యా బలం తమకి ఉందని కచ్చితంగా తమ భవిష్యత్తుపై చెడు ప్రభావం చూపే నిర్ణయాలు తీసుకునే పార్టీలను ఓడించి తీరుతామని వారు తెగేసి చెబుతున్నారు. కూటమి పార్టీలకి ముస్లిం సమాజం నుండి ఎదురవుతున్న నిరసనలకు ఎలా సమాధానం చెప్పాలో తెలియక టీడీపీ, జన సేన నాయకులు అక్కడ నుండి జారుకోవడం ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది.