మీకు స్థానిక నేత కావాలా, లేక హైదరాబాద్ టూరిస్ట్ కావాలా?
Vijaya Sai Reddy : టీడీపీ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో జరిగిన ఏడు అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరిలో కేవలం రెండుసార్లు మాత్రమే టీడీపీ గెలిచిందని ఎంపీ విజయసాయిరెడ్డి (Vijaya Sai Reddy)వెల్లడించారు. సామాజిక సాధికార యాత్రలో భాగంగా విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.
టీడీపీ ఏర్పడిన తర్వాత 1983, 1985 లో జరిగిన ఎన్నికల్లో మాత్రమే మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ విజయంసాధించిందని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. బడుగు బలహీన వర్గాల వారికి ముఖ్యంగా బీసీ, ఎస్సి,ఎస్టీ, మైనారిటీల క్షేమం కోసం జగన్ ప్రభుత్వం కృషి చేస్తుందని వారి సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యమిస్తుందని చెప్పిన ఎంపీ విజయసాయిరెడ్డి ఇక్కడ స్థానికంగా ఉన్న నేతను ఎన్నుకుంటారా లేక హైదరాబాద్ లో నివాసముంటూ అప్పుడప్పుడూ ఇక్కడికొచ్చే హైదరాబాద్ టూరిస్ట్ లోకేష్ ని ఎన్నుకుంటారో ప్రజలు ఆలోచించుకోవాలని విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు.