Health Department : ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖలో పెద్ద ఎత్తున పోస్టుల నియామకాల పరంపరను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కొనసాగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం (Health Department)మెడికల్ కాలేజీల్లో 424 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకోసం రెండో రోజుల క్రితమే నోటిఫికేషన్ జారీ చేసింది. కాగా ఈ గురువారం మరో రెండు నోటిఫికేషన్లు జారీ చేసింది. జాతీయ ఆరోగ్య మిషన్ (నేషనల్ హెల్త్ మిషన్) పరిధిలో వివిధ ఆరోగ్య కార్యక్రమాలకు సంబంధించి అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు, ఎస్ఎన్ సియులు, డిఇఐసిలు, ఎన్సిడిల వంటి ఆరోగ్య వ్యవస్థలలో ఖాళీగా వున్న 234 స్పెషలిస్టు డాక్టర్ల నియామకానికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్న ట్లు ఆంధ్రప్రదేశ్ వైద్యసేవల రిక్రూట్మెంట్ బోర్డు కార్యదర్శి ఎం. శ్రీనివాసరావు గురువారం తెలిపారు. ఆసక్తి గల అభ్య ర్థులు ఈనెల 7వ తేదీ రాత్రి 11.59 గంటల లోపు తమ దర ఖాస్తుల్ని ఆన్లైన్లో సమర్పించాలని సూచించారు.
మెడికల్ రిక్రూట్మెంట్ ద్వారా వైద్య ఆరోగ్య శాఖలలో ఎక్కడ ఖాళీలు ఉన్నా తక్షణమే భర్తీ అయ్యేలా చూడమని జగన్ అధికారులను ఆదేశించినట్లు సమాచారమ్. దీనితో శరవేగంగా రోజులు వ్యవధిలోనే ఖాళీలు భర్తీ అవుతున్నాయి. వైసీపీ ప్రభుత్వం వైద్య రంగంలో విప్లవాత్మకమైన చర్యలు చేపట్టడమే కాకుండా, గడిచిన ఏడాదిన్నరలో నిరంతరం నియామకాలు చేపట్టింది.
ఇంతేకాక, మారుమూల ప్రాంతాలు, గిరిజన తండాలలో పనిచేసే డాక్టర్లని ఆకర్షించడం కోసం ప్రభుత్వం భారీ వేతనాలను కూడా ప్రకటించింది. కాంట్రాక్టు పద్ధతిలో పనిచేసే డాక్టర్లకు మారుమూల ప్రాంతాల్లో నెలకు రెండు లక్షల రూపాయలు, గిరిజన ప్రాంతాల్లో పనిచేసేవారికి నెలకి రెండున్నర లక్షల జీతాన్ని ప్రభుత్వం ఇవ్వనుంది. దీనితో పాటు విలేజ్ క్లినిక్లు, హెల్త్ సెంటర్లు, ఫామిలీ డాక్టర్ ఇలా వైద్య రంగం మొత్తాన్ని సామాన్య ప్రజలకి అందుబాటులో ఉండేలా అనేక రకాల కార్యక్రమాలను, వాటిని నడిపేందుకు ఆరోగ్యం శాఖలో కొత్త సిబ్బందిని చేర్చీకుంటుంది.