ఈరోజు చిలకలూరిపేట లో ప్రజాగళం పేరుతో జరిగిన ఎన్డీయే కూటమి మీటింగ్ కి వచ్చిన మోదీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరికి ఓటు వెయ్యాలో చెప్పకనే చెప్పాడు.. బాబు అండ్ కో, పవన్ కల్యాణ్ లు ఊహించినట్లు జగన్ మీద అవినీతి ఆరోపణలు చేయకుండా, జగన్ ను ఒక్క మాట అనకుండా కేవలం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏం చేసింది, దేశానికి ఏం చేసింది అనేది మాత్రమే చెప్తూ, మరోసారి కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మద్దతివ్వాలని కోరాడు. మరో వైపు రాష్ట్ర ప్రభుత్వం విషయానికి వస్తే ఎలాంటి పెద్ద ఆరోపణ చేయకుండా, కాంగ్రెస్ వైసీపీ ఒకటే అని మాత్రమే ఏదో నామ్ కే వస్తే విమర్శ ఒకటి చేసి కాంగ్రెస్ మీద విమర్శ చేయడానికే మొగ్గు చూపాడు తప్పా జగన్ ను పల్లెత్తి మాట అనలేదు సరికదా, గత ఐదేళ్లలో రాష్ట్రంలో కేంద్రం చేసిన అభివృద్ధి గురించి వివరించాడు, కొత్తగా వచ్చిన విద్యా కేంద్రాల గురించి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల గురించి మాత్రమే వివరించి ఎన్డీఏ కు ఓటెయ్యమని కోరాడు.. పరోక్షంగా ఇది జగన్ హయాంలో కేంద్రం నుండి సాధించిన అభివృద్ధి అని భావించాలి..
గతంలో 2019 ఎన్నికలప్పుడు మోడీ ఎన్నికల ప్రచారం చూస్తే ఏపీ లో అవినీతి భారీ స్థాయిలో జరిగింది అనీ, బాబు పోలవరాన్ని ఏటీఎం లా వాడుకున్నాడు అనీ, సొంతమామ కే వెన్నుపోటు పొడిచాడు అనీ, ఎప్పుడు ఢిల్లీ వచ్చినా జగన్ ను అరెస్ట్ చేయమని తప్పితే రాష్ట్ర అభివృద్ధి గురించి ఏ విషయం మాట్లాడటం కానీ, ప్రాజెక్టుల గురించి కానీ అడిగేవాడు కాదని స్పష్టంగా ప్రజల ముందు చెప్పాడు.. కానీ ఇప్పుడు అవేం లేవు..
అలాగే తెలంగాణ ఎన్నికల ప్రచారం లో కూడా కేసీఆర్ పై భారీ స్థాయిలో విమర్శలు చేశాడు. కొడుకును సీఎం చేయమని (ఆశీర్వదించమని) అడుగాడని, అవినీతి పరుడని విమర్శ చేశాడు. నిన్న గాక మొన్న ఏర్పాటు అయిన తెలంగాణ కాంగ్రేస్ ప్రభుత్వం పై కూడా భారీ స్థాయిలో విరుచుకుపడ్డాడు.. అలాంటిది జగన్ ప్రభుత్వం పై గానీ, జగన్ మీద కానీ ఎలాంటి ఆరోపణ చేయకుండా పరోక్షంగా మీ మనసుకు నచ్చిన వారికి ఓటెయ్యమని చెప్పి తన ప్రసంగం ముగించాడు…ఇదాంతా జరుగుతున్న సమయంలో స్టేజ్ మీద ఉన్న బాబు, పవన్ ల మొహంలో నెత్తురు చుక్క లేకపోవడం చూస్తే గెలుపెవరిదో స్పష్టం అవుతుంది..