తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి వయసు దృష్ట్యా ఇవే చివరి ఎన్నికలు కావొచ్చు. అందువల్ల సర్వశక్తులు ఒడ్డుతున్నాడు. కుట్రలు, కుతంత్రాలతో ముందుకెళ్తున్నాడు. కానీ ఎక్కడా పాజిటివ్ వైబ్స్ లేవు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పక్కనున్నా ఏమీ ఒరగడం లేదు. దీంతో బాబు సేనాని ద్వారా మెగా ఫ్యామిలీని రంగంలోకి దింపాలని చూస్తున్నాడు. కానీ సాధ్యమయ్యే సూచనలు కనిపించడం లేదు.
జూనియర్ ఎన్టీఆర్‌కు ఇప్పుడు నేషనల్ వైడ్ పాపులారిటీ ఉంది. కానీ లోకేశ్ కోసం అతడిని చంద్రబాబు రానివ్వడం లేదు. ఎన్టీఆర్ కూడా తన తండ్రి హరికృష్ణకు ఎల్లో గ్యాంగ్ చేసిన అన్యాయాన్ని తలుచుకుని వారికి దూరంగా ఉంటున్నాడు. ఇక మెగా ఫ్యామిలీపైనే బాబు హోప్స్ పెట్టుకున్నాడు. ఈ విషయం పవన్‌కు చెప్పగా ఆయన ఇటీవల చిరంజీవిని కలిపినప్పుడు మాట్లాడినట్లు తెలిసింది.
చిరు కేంద్ర మంత్రి పదవి నుంచి దిగిపోయాక ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నాడు. ప్రజారాజ్యం సమయంలో రామ్‌చరణ్, అల్లు అర్జున్ తదితర మెగా హీరోలు ప్రచారం చేశారు. ఆ పార్టీ మూతపడ్డాక వారంతా సైలెంట్ అయ్యారు. జనసేనకు పరోక్షంగా మద్దతు ఇస్తున్నారు కానీ ప్రత్యక్షంగా రంగంలోకి దిగలేదు. 2019లో పవన్ తీవ్రంగా ప్రయత్నించినా ఎవరూ అంగీకరించలేదు. నాగబాబు నరసాపురం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయగా వరుణ్‌తేజ్, కుటుంబం కొద్దిరోజులు తిరిగింది.
2024లో చంద్రబాబు గెలుపే లక్ష్యంగా పవన్ పనిచేస్తున్నాడు. ఇది కాపులకు, మెగా అభిమానులకు అస్సలు నచ్చలేదు. దీంతో వారి ఓట్లు ట్రాన్స్ఫర్ కావాలంటే చిరంజీవి, రామ్‌చరణ్, అల్లు అర్జున్ సపోర్టు కావాలి. బాబు కోరిక మేరకు చిరు వద్ద ఈ విషయం ప్రస్తావించగా తాము నేరుగా వచ్చి ప్రచారం చేయనని తెగేసి చెప్పినట్లు సమాచారం. నిన్ను వదులుకోలేము కాబట్టి సోషల్ మీడియా వేదికగా పిలుపునిస్తామని కుండబద్ధలు కొట్టారట. ఇంక ఆర్ఆర్ఆర్తో రామ్‌చరణ్, పుష్పతో అర్జున్ ప్యాన్ ఇండియా స్టార్లుగా మారారని, ఇప్పుడు పొలిటికల్ ప్రచారం చేస్తే వారి భవిష్యత్‌పై ప్రభావం పడుతుందని, అందువల్ల ఇద్దరినీ ఇందులోకి లాగొద్దని తమ్ముడికి అన్న చెప్పాడని ఫిల్మ్‌నగర్‌లో టాక్ నడుస్తోంది. పవన్ ఒంటరిగా బరిలో ఉండి.. అతనే సీఎం అభ్యర్థి అయితే ఫ్యామిలీ మొత్తం తిరిగేదని, బాబు కోసం తిరగాల్సిన అవసరం తమకు లేదని చిరంజీవి సన్నిహితులతో అన్నారని తెలిసింది.
బాబు కోసం బీజేపీ పెద్దల వద్ద తిట్లు తిన్న పవన్.. ఈసారి కుటుంబం వద్ద చులకనయ్యాడు. నారా వారి గురించి తెలిసి జూనియర్ ఎన్టీఆరే దూరంగా ఉంటే నువ్వెందుకు అంతలా పూసుకుంటున్నావని చిరు ప్రశ్నించినట్లు తెలిసింది. కేవలం నిన్ను, జనసేనను పొగుడుతూనే పోస్టులు పెడతానని, ప్రచారమంటే కుదరని తేల్చేశారట. ఇక చేసేదేమి లేక సేనాని జబర్దస్త్ ఆర్టిస్టులను రంగంలోకి దింపాడని సేన వర్గాలు చెబుతున్నాయి.