ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ముగియగానే గెలుపు ఎవరిదనే అంశంపై ఎవరి లెక్కలు వారు వేసుకుంటూ ఉన్నారు. అధికార వైసీపీకి మహిళలు , గ్రామీణ ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు పలికారని చెబుతున్న టీడీపీ అనుకూల ఛానల్స్, తెలుగుదేశానికి మాత్రం పట్టణ వాసులు పక్క రాష్ట్రాల్లో సెటిల్ అయిన వారు పూర్తి స్థాయిలో మద్దతు పలికారని చెబుతూ వస్తున్నారు. ఎన్నికల ముందు రోజు హైదరాబాద్ నుండి లక్షల్లో ప్రజలు ఏపీకి ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చారని, ఆ వచ్చిన వారిలో అధిక శాతం మంది చంద్రబాబుకే జై కొట్టారనే ఒక వాదన బలంగా ప్రజల్లోకి పంపే ప్రయత్నం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే తెలుగుదేశం, జనసేన చేస్తున్న ఈ ప్రచారంలో అర్ధమే లేదని రాజకీయ విశ్లేషకులు కొట్టి పారేస్తున్నారు. సెటిలర్స్ పూర్తిగా చంద్రబాబుకు ఏ ప్రామాణికంగా మద్దతు పలికారని ప్రచారం చేస్తున్నారో వారి దగ్గర సరైన సమాధానమే లేదని వారు చెబుతున్న మాట. నిజానికి తెలంగాణ ఎన్నికల సమయంలో కూడా అధికార బీఆరెస్ ప్రభుత్వాన్ని సెటిలర్స్ దించేస్తారని దానికి కారణం చంద్రబాబు అరెస్ట్ సమయంలో కేటీఆర్ మాట్లాడిన మాటలే అని ప్రగల్భాలు పలికారు. కానీ చివరికి తెలంగాణ ఎన్నికల్లో బీఆరెస్ ఓటమి పాలైనా అది సెటిలర్స్ వలన కాదని వచ్చిన ఫలితాలు బట్టి తేలిపోయింది. నిజానికి బీఆరెస్ పార్టీ ఓటమి పాలైన గౌరవప్రదమైన సీట్లు తెచ్చుకోవడానికి హైదరాబాద్ చుట్టు ఉన్న సెటిలర్స్ వేసిన ఓట్లే అని విశ్లేషకులు సైతం ఒప్పుకున్నారు.
ఇక పవన్ కళ్యాణ్ సైతం తెలంగాణలో పోటీ చేసిన అన్ని చోట్ల డిపాజిట్ కూడా తెచ్చుకోలేకపోయారు. కనీసం బర్రెలక్కకి వచ్చిన ఓట్లు కూడా జనసేన అభ్యర్ధులు తెచ్చుకోలేక పోయారని వచ్చిన ఫలితాలు చెబుతున్న సత్యం. వాస్తవం ఇలా ఉంటే అదే సెటిలర్స్ ఉన్న ప్రాంతంలో వారి ప్రభావితం కాస్తో కూస్తో ఉన్న వ్యక్తులు వచ్చి నేరుగా కూటమికి ఓట్లు వేసారంటే అది నమ్మసక్యంగా లేదని తెలుగుదేశం వారి అనుకూల మీడియా చేస్తున్న ప్రచారంలో మొత్తం డొల్లతనమే కానీ వాస్తవికత కనిపించడంలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట.