అసలు స్టూడియోలు ఎవరు కట్టాలి? మా వాళ్ళు మాత్రమే కట్టాలి. ఎక్కడ కట్టాలి ? అమరావతిలో కట్టాలి లేదా మా బెజవాడలో కట్టాలి. అంతేగాని రాయలసీమలో కడతాం అంటే ఎలా ? ఇలా ఉంది ఎల్లో మీడియా వ్యవహారం.
మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా మద్రాస్ లో ఉన్న సిని పరిశ్రమను ఇక్కడికి తీసుకురావడానికి సినిమా స్టూడియో నిర్మించడానికి సుపర్ స్టార్ కృష్ణ గారికి 9.5 ఎకరాలు ఇచ్చింది. ఇదేం తప్పు కాదు. అదే మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అన్నపూర్ణ స్టూడియోస్ కి ఆనుకుని ఉన్న 5 ఎకరాల ల్యాండ్ ను అవుట్ డోర్ షూటింగుల కోసమని ప్రభుత్వం అక్కినేని నాగేశ్వరరావుకి కేటాయించింది. ఇది కూడా తప్పు కాదు. అలాగే రామానాయుడు స్టూడియో. ఇవేం తప్పులు కానప్పుడు మహీ.వీ. రాఘవ్ కి రాయలసీమలో రెండు ఎకరాలు కేటాయిస్తే మాత్రం పెద్ద తప్పు అయిపోయింది .
1996లో బాబు సీఎం గా ఉన్నప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీ కోసం రామోజీరావు వేల ఎకరాలు ఆక్రమించుకోవచ్చు. హైదరాబాద్లో అత్యంత ఖరీదైన బంజారాహిల్స్ పరిధిలోని షేక్పేట్లో సినీ పరిశ్రమను అభివృద్ది చేస్తామంటూ రెండు ఎకరాల స్థలాన్ని తీసుకుని వాణిజ్య అవసరాలకు వినియోగించుకుంటున్న రాఘవేంద్రరావు కనిపించడు. ఇది మాత్రం రాధా కృష్ణకి తప్పుగా కనపడదు.
రేపటి రోజు చిన్న సినిమాలు, సీరియల్స్ షూటింగ్స్ సీమలో జరిగితే…అక్కడ 10 మంది ఉపాధి పొందితే…ఈ బ్యాచ్ తట్టుకోలేదు. అమరావతిలో మాత్రం నవ నగరాలు అని చెప్పి అందులో ఒక నగరానికి ఫన్ సిటీ అని పేరు పెట్టి…తమ వర్గానికి వేల ఎకరాలు కట్టబెట్టే ప్లాన్స్ వేస్తే అబ్భో అదో మహా అభివృద్ది అని భాజా వేయాలి. అంతేగాని రాయలసీమలో 2 ఎకరాల్లో మినీ స్టూడియో కట్టుకుంటాం అంటే మాత్రం ఎక్కడ లేని నొప్పులు వస్తాయి ఈ వర్గానికి.
మహీ వి రాఘవ్ కి లేని అర్హత ఏమిటి?
రచయిత, నిర్మాత, దర్శకుడిగా సినీ పరిశ్రమలో 16 ఏళ్లుగా ఉంటున్న.. డైరెక్టర్ మహి వి.రాఘవ్ తాను పుట్టిన రాయలసీమ ప్రాంతంలో రెండెకరాల్లో స్థలంలో మిని స్టూడియో నిర్మించి వెనుక బడిన ప్రాంతమైన రాయలసీమలో ఉపాధి కల్పించాలని చూస్తే మాత్రం ఎక్కడలేని విషం కక్కేస్తాం . ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో మేమే ఉండాలి వేరొకరు ఎదగకూడదనే ఏడుపు. సినిమాలలో విలన్స్ కి రెడ్డి సామాజిక వర్గ పేర్లు పెట్టడం దగ్గర నుండి దాడి చేస్తూనే ఉన్నారు.
రచయిత, నిర్మాత, దర్శకుడిగా మహీకి ప్రభుత్వం నుండి స్థలం పొందడానికి అన్ని అర్హతలు ఉన్నా వైజాగ్ లోనో , హైదరాబాద్ లోనో స్థలం కోరడంలేదు. మూన్ వాటర్ పిక్చర్స్, 3 ఆటమ్ లీవ్స్ అనే రెండు నిర్మాణ సంస్థలను స్థాపించి పాఠశాల, యాత్ర 2, సిద్ధా లోకమెలా ఉంది, సైతాన్ వెబ్ సిరీస్ లను రాయలసీమలోనే చిత్రీకరించిన చరిత్ర అతనిది.
తన ప్రాంతం కోసమే తన వంతుగా ఏదో ఒకటి చేయాలనే ఆశయంతో కేవలం రెండు ఎకరాల భూమిలోనే మిని స్టూడియో నిర్మించాలనుకుంటున్నారు . సినీ పరిశ్రమలో రాయలసీమలో షూటింగ్స్ చేయటానికి ఇప్పటివరకు ఎవరూ ఆసక్తి చూపలేదు. ఓ వర్గం మీడియా దీని గురించి కనీసం ఆలోచన కూడా చేయడంలేదు. వాళ్ల ప్రభుత్వంలో వాళ్లకు నచ్చినవారికి ఎవరెవరికో ఎక్కడెక్కడో భూములు ఇచ్చారు. వాటి గురించి ఎల్లో మీడియా ఎవరూ నోరెత్తరు కానీ రాయలసీమ అంటే చాలు ఏడ్చి చస్తారంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది.