పి.గన్నవరం నుంచి పోటీ చేసే అవకాశం పోవడంతో మహాసేన రాజేష్ బాధలో ఉంటారని భావించిన వారికి ఇది బ్యాడ్ న్యూస్. అతను తన ధోరణి మార్చుకోలేదు. కొడితే కుంభ స్థలాన్ని కొట్టాలని అనే విధంగా 2024 ఎన్నికలు ముగిసేలోగా ఎలాగైనా కోట్ల రూపాయలు సంపాదించాలని టార్గెట్‌గా పెట్టుకున్నాడు. ఆ దిశగానే అడుగులు పడుతున్నాయి.
దళితులు ఓట్ల కోసం తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు రాజేష్‌ను వదలడం లేదు. ఇద్దరూ కలిసి కొత్త నాటనానికి తెరతీశారు. ఎన్నికల్లో అవకాశం ఉన్న ప్రతి నియోజకవర్గాల్లో తన మనుషులు పోటీ చేస్తారని సోషల్ మీడియా వేదికగా రాజేష్ ప్రకటించాడు. జనాన్ని ఏమార్చేందుకు ఇలా రాసుకొచ్చాడు. ‘నేను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిని. టీడీపీ అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీ లేదా కార్పొరేషన్ చైర్మన్ అవుతాను. పార్టీ నుంచి బయటకు వస్తున్నా. చంద్రబాబుకు క్షమాపణలు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అనేది చాలా కీలకం. ఆంధ్రాలో మాత్రం బీజేపీకి ప్రతిపక్షం లేదు. ఇక్కడ ఏ పార్టీకి ఓటు వేసినా అది కమలం పార్టీకే పడుతుంది.. ఇది రాజ్యాంగ విరుద్ధం. బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలనుకున్న వారికి ఆ అవకాశాన్ని దూరం చేయకూడదు. అందువల్ల మేం 2024 ఎన్నికల్లో పోటీకి దిగాలని భావిస్తున్నాం. ఇప్పటికీ దాదాపు 100 నియోజకవర్గాల్లో మా వాళ్లు సిద్ధమయ్యారు. ఇంకా ఆసక్తి ఉన్న వారు సంప్రదించండి’ అంటూ ఫోన్ నంబర్ పెట్టాడు.
టీడీపీ ఎన్డీఏలో చేరాక చంద్రబాబుపై దళితులు, క్రైస్తవులు, ముస్లింలు చాలా కోపంగా ఉన్నారు. దీనిని ఎలాగైనా తప్పించుకోవడానికి బాబు యత్నిస్తున్నారు. ఇందులో భాగంగా రాజేష్ అనే కార్డును వాడుతున్నారు. అతను పైకి టీడీపీ.. బీజేపీతో కలవడంతో ఆత్మగౌరవం కోసం ఇలా చేస్తున్నామని చెబుతున్నా అసలు విషయం వేరే ఉంది. ఇదంతా టీడీపీకి లబ్ధి చేకూర్చేందుకేనని ఇట్టే అర్థమవుతోంది. ఇప్పటికే టికెట్ వదులుకున్నందుకు చంద్రబాబు రూ.5 కోట్ల డబ్బును రాజేష్‌కు ఇచ్చినట్లు సమాచారం. ఇక ఎన్నికల్లో మా వాళ్లు నిలబడ్డారు.. మహాసేన మద్దతు ఇస్తోందని కలెక్షన్లు చేసేందుకు, ఇంకా అండగా ఉంటానంటూ అభ్యర్థుల నుంచి ఎంతో కొంత పోగు చేసుకునేందుకు రాజేష్ ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. దళితుల ఓట్లు చీల్చేందుకు ఖర్చుల కోసమంటూ బాబు నుంచి డబ్బు తీసుకునే అవకాశం ఉంది. మొత్తంగా ఇతని పని బాగుంది. దళిత యువకుల్ని మోసం చేసి తను మాత్రం కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. పెద్ద స్కెచ్ వేసి.. పైకి మాత్రం కబుర్లు చెబుతుంటాడు.