ఇచ్చినట్టే ఇచ్చి టికెట్ వెనక్కి లాగేసుకోబడడంతో మహాసేన రాజేష్ నైరాశ్యం లోకి వెళ్లినట్లు గా ఉంది..
“ఒకేరోజు ఓకే కోర్టులో మూడు కేసులు, సాయంత్రం వరకూ నిలబడే ఉన్నాను, ఇతరుల కోసం పోరాడి ఇలా భాద భరిస్తున్నాను, నాలాంటి వాడు రాజకీయ పార్టీలలో పని చేయడానికి పనికి రాడు. అందుకే వైసీపీ, బీజేపీ పార్టీ లతో ఉన్న శత్రుత్వాన్ని ఈరోజు నుండి వదిలేస్తున్నాను” అని తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేశాడు..
మొదటి నుండే రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ, రౌడీ ఇజం చేస్తూ, దందాలు చేస్తూ, రౌడీ షీట్ కలిగి ఉన్న రాజేష్ ఇవాళ ఇతరుల కోసం పోరాడటం వల్ల నా మీద కేసులు పడ్డాయని సింపతీ గేమ్ ఆడటం హాస్యాస్పదం. కులాలని తిట్టి, మతాలను తిట్టి, దేవుళ్లని తిట్టి, కాపులను తిట్టి, అగ్రవర్ణాలను తిట్టి, ఆఖరికి అంబేద్కర్ రాజ్యాంగం కూడా విఫల్ అయిందనే విధంగా కాస్తంత విషయపరిజ్ఞానం లేకుండా యూట్యూబ్ ఛానెల్ ఉంది కదా, టీవీ ఛానెళ్లు పిలుస్తున్నాయి కదా అని తనకు తాను మేధావిగా ఊహించుకున్న రాజేష్ కు ఇప్పటికీ బోధ పడని తత్వం ఏమిటంటే.. “తనకు శత్రువులు వైసీపీ నో, బీజేపీ నో కాదు ఎందుకంటే ఆ రెండు పార్టీలు ఒక పెద్ద వ్యవస్థ, ఆ వ్యవస్థలకు తన లాంటి వ్యక్తులతో శత్రుత్వం ఉండదు, అది తన స్థాయి కాదు, కేవలం వాళ్లని తన రాజకీయ అవసరం కోసం శత్రువు గా భావించాడు తప్ప వాళ్ల దృష్టిలో తను ఒక వ్యక్తి మాత్రమే, అసలు తన మొదటి శత్రువు తనే” అనే విషయాన్ని గ్రహించకపోవడమే.
సామాన్యుడు ఎమ్మెల్యే అవ్వలేడా, ఎంపీ అవ్వకూడదా? అని రాజేష్ తనని ఎవరో తొక్కేసినట్టు భావించొచ్చు గాక, కానీ ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎమ్మెల్యే, ఎంపీ కావచ్చు. నందిగాం సురేష్ తనకంటే అత్యంత సామాన్య వ్యక్తి ఆయన ఎంపీ అవ్వలేదా? ఆయన కూడా దళితుడే కదా? ఇలా సామాన్యులు ఎంపీ, ఎమ్మెల్యే లు అయిన సందర్భాలు కోకొల్లలు.. కానీ రాజేష్ కి అడ్డుగా ఉంది తన కులమో, తన ఆస్తో కాదు. కేవలం తన స్వార్థం, నిలకడ లేని తనం, సిద్ధాంతం లేని పోరాటం, అర్థం లేని వాదన, పద్ధతి లేని వ్యవహార శైలి మాత్రమే..
ఏదైనా రాజేష్ మాత్రం పార్టీ టికెట్ దక్కించుకోలేక పోయినా, టీడీపీ అభ్యర్థి నుండి మూడు కోట్లు పొందాడు.. ఆవిషయం లో మాత్రం తను సక్సెస్ అయినట్లే. కనీసం ఆ మూడు కోట్లు అయినా ఇంతకు ముందు లా పేద దళితుల దగ్గర నుండి వసూలు చేసిన లక్షల రూపాయలను లగ్జరీ కార్ల కోసం, తన సొంత లగ్జరీ లకోసం కాకుండా, నా నా అని పొద్దున లేస్తే ఊదరగొట్టే తన దళిత సోదరుల బాగు కోసం ఖర్చు చేసి నాలుగు మంచి పనులకు వాటిని వాడితే ఇప్పటి నుండి అయినా కాస్త మంచి పేరు లభించే అవకాశం ఉంది. లేదా ఆ మూడు కోట్లతోనే తన రాజకీయ జీవితం అంతం అవుతుంది..